జాతీయ వార్తలు

పశ్చిమ బెంగాల్ ఇక ‘బెంగాల్’ త్వరలో పేరుమార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఆగస్టు 2: పశ్చిమ బెంగాల్ ఇక నుంచి బెంగాల్ కాబోతోంది. రాష్ట్రం పేరును బెంగాల్‌గా మార్చాలని రాష్ట్ర కేబినెట్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంగ్లంలో దీన్ని బెంగాల్‌గా, బెంగాలీ భాషలో బంగో లేదా బంగ్లాగా మార్చాలని నిర్ణయించినట్టు రాష్ట్ర మంత్రి పార్థా చటర్జీ వెల్లడించారు. ముంబయి, బెంగళూరుగా కొన్ని పట్టణాల పేర్లు మారడం, అలాగే ఒరిసా పేరును ఒడిశాగా మార్చడాన్ని ప్రస్తావించిన ఆయన బెంగాల్ అన్న పదంతో రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ముడివడి ఉంటాయని..అందుకే పశ్చిమ బెంగాల్‌ను ఇక నుంచి బెంగాల్‌గా వ్యవహరించాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాష్ట్రం పేరును పశ్చిమ బంగోగా మార్చాలంటూ గతంలో కేంద్రానికి ప్రతిపాదన పంపినప్పటికీ ఇప్పటి వరకూ ఎలాంటి ప్రతిస్పందన రాలేదని తెలిపారు. ఇప్పుడు తాజాగా మరో ప్రతిపాదన పంపుతున్నామని, 26న రాష్ట్ర కేబినెట్‌ను ప్రత్యేకంగా సమావేశ పరిచి పశ్చిమ బెంగాల్ పేరును బెంగాల్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంటామని చటర్జీ వెల్లడించారు.