జాతీయ వార్తలు

నేపాల్ ప్రధానిగా మళ్లీ ప్రచండ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండు, ఆగస్టు 2: నేపాల్ మావోయిస్టు నాయకుడు పుష్క కమాల్ దహల్ ‘ప్రచండ’ రెండోసారి దేశ ప్రధాన మంత్రి పదవిని చేపట్టేందుకు మార్గం సుగమమైంది. బుధవారం జరుగనున్న ఎన్నికకు సంబంధించి ప్రచండ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మధేసీలు, నేపాల్ కాంగ్రెస్, సిపిఎన్ మావోయిస్టు మధ్య కుదిరిన ఒప్పందం నేపథ్యంలో దేశ కొత్త ప్రధానిగా ప్రచండ ఎన్నిక లాంఛనంగా మారింది. ప్రచండ పేరును నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా ప్రతిపాదించగా, మావోయిస్టు నేత కృష్ణ బహదూర్ మహారా బలపరిచారు.
మూడు ప్రధాన పార్టీల మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం నేతృత్వంలో దేశంలో రాజకీయ సుస్థిరత ఏర్పడగలదన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.