జాతీయ వార్తలు

సరిహద్దుకు బ్రహ్మోస్ రక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 3: చైనాను ఆనుకుని ఉన్న సరిహద్దుల్లో అదనంగా సూపర్‌సోనిక్ బ్రహ్మస్ క్షిపణులను మోహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 290 కి.మీ దూరంలోని ఏ లక్ష్యాన్నైనా ఛేదించగలిగే సామర్థ్యం ఈ క్షిపణులకు ఉం టుంది. చైనాను ఆనుకుని ఉన్న తూర్పు సెక్టార్ సరిహద్దు పొడవునా రక్షణపరమైన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్న ఉద్దేశంతోనే బ్రహ్మోస్‌ను మోహరింపును ఆమోదించినట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. మరోపక్క నాలుగో బ్రహ్మోస్ రెజిమెంట్‌ను 4,300 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం ఆమోదించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఈ రెజిమెంట్‌లో వందకు పైగా క్షిపణులు, మరో ఐదు లాంచర్లు, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉంటాయని తెలిపాయి. గత ఏడాది మేలో చైనాను ఆనుకున్న తూర్పు సెక్టార్‌లో ఈ క్షిపణిని ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఇది క్రూయిజ్ క్షిపణి కాబట్టి పర్వత ప్రాంతాల్లో వున్న శత్రు లక్ష్యాలను కూడా ఛేదించగలుగుతుందని వెల్లడించారు.
ఇప్పటికే మూడు రెజిమెంట్ల బ్రహ్మోస్ క్షిపణులు సైనిక దళాల అమ్ములపొదిలో చేరాయి. భూతలంలోని లక్ష్యాలను ఛేదించే బ్రహ్మోస్ క్షిపణి 2007 నుంచే సైనిక దళాలకు సేవలందిస్తోంది. బ్రహ్మోస్ క్షిపణిని జలాంతర్గాములనుంచి, నౌకల నుంచి, విమానాలనుంచి లేదా భూతలంనుంచి కూడా సునాయాసంగా ప్రయోగించేందుకు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేందుకు ఎంతైనా ఆస్కారం ఉంటుందని ఈ వర్గాలు తెలిపాయి.
chitram...
భూతలంలోని లక్ష్యాలను ఛేదించే బ్రహ్మోస్ క్షిపణి