జాతీయ వార్తలు

తుంగభద్రకు పెరుగుతున్న వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బళ్ళారి, ఆగస్టు 9: తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో పెరుగుతోంది. ఎగువ ప్రాంతంలో తుంగనది పరిసరాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయం నిండడంతో దిగువ తుంగభద్ర జలాశయానికి నీరు విడుదల చేశారు. మంగళవారం 44,713 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో జలాశయం నీటిమట్టం 43.983 టిఎంసిలకు చేరుకుంది.
జూరాలలో తొమ్మిది గేట్లు ఎత్తివేత
గద్వాల: ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణ్‌పూర్ జలాశయాల నుంచి వరద నీటి ఉదృతి పెరుగుతుండడంతో జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మంగళవారం సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 317.910 మీటర్ల స్థాయిలో 8.434 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతం నుంచి 1,72,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు నుంచి తొమ్మిది గేట్లను తెరిచి దిగువకు 1,82,787 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువకు 750 క్యూసెక్కులు, సమాంతర కాలువకు వెయ్యి క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-1కు 1300 క్యూసెక్కులు, లిఫ్ట్-2కు 750 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి జలాశయంలో 518.490 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 2,07,625 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయంలో 104.969 టిఎంసిల నీరు నిల్వ ఉంది. నారాయణ్‌పూర్ జలాశయంలో 491.020 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు 21 గేట్లను తెరిచి దిగువకు 2,10,764 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అదేవిధంగా జూరాలలో ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

తుంగభద్ర జలాశయం

జూరాలలో నీరు
విడుదల చేసిన దృశ్యం