జాతీయ వార్తలు

గో సంరక్షణ పేరిట దాడులు సహించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9:గోసంరక్షణ పేరుతో దాడులు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. బూటకపు గో సంరక్షకులను శిక్షించాలని రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది. దేశ చరిత్ర, సంస్కృతిలో గోవులకు ఎంతో ప్రత్యేకమైన, పవిత్రమైన స్థానం ఉందని పేర్కొన్న హోం మంత్రిత్వ శాఖ ‘గో రక్షణ అంటే గోవులను రక్షించడం మాత్రమే కాదు..ఈ ప్రపంచంలో అత్యంత బలహీనమైన మూగజీవాలను కాపాడటమే’నన్న మహాత్ముడి భావనను కూడా ఉటంకించింది. అయినా గో రక్షణ పేరుతో ఎవరికీ ఇతరులపై దాడులు చేసే అధికారం లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. చట్ట వ్యతరేకంగా ఎవరు ఇందుకు పాల్పడినా అది క్షమార్హం కాదని, శిక్షార్హమేనని పేర్కొంది. ఇందుకు సంబంధించి దోషులపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని..ఎలాంటి మినహాయింపు లేకుండా ఇలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఏ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదని..ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తి లేదా వ్యక్తులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాల్సిందేనని తెలిపింది. సాధ్యమైనంత త్వరగానే ఇందుకు సంబంధించిన కేసుల్ని పరిష్కరించి..దోషులపై చర్యలు తీసుకోవాలని కోరింది. గో రక్షణ పేరిట ముస్లింలు, దళితులపై దాడులు జరగడంపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.