జాతీయ వార్తలు

అరుణాచల్ మాజీ సిఎం ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటానగర్, ఆగస్టు 9: అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కలిఖోపుల్ మంగళవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. ముఖ్యమంత్రి అధికార నివాసంలోనే ఉదయం 7.30 గంటల సమయంలో ఉరివేసుకుని చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నలభై ఏడేళ్ల కలిఖోపుల్ తన బెడ్రూమ్‌లో సీలింగ్‌ఫాన్‌కు ఉరివేసుకున్నట్లు ఆయన భార్యల్లో ఒకరు గుర్తించి పోలీసులకు తెలియజేశారు. ఫిబ్రవరి 19న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కలిఖో పుల్ జూలై 13న సుప్రీం కోర్టు తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావటంతో పదవి కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత తన అధికార నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉన్నప్పటికీ, తన సొంత ఇంటికి మరమ్మతులు చేస్తున్నందున మరికొన్ని రోజులు గడువు ఇవ్వాలని కలిఖో ప్రభుత్వాన్ని కోరారు. ఈలోగానే మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. పుల్ ఆత్మహత్య ఘటనపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. కాగా పుల్ ఆకస్మిక మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులు సంతాపదినాలుగా ప్రకటించింది. కలిఖో పుల్ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం అధికార నివాసంలో ఉంచారు. మరోవైపు కలిఖో పుల్ మృతిపట్ల ఆగ్రహించిన ఆయన అనుచరులు ఇటానగర్‌లో పెద్దఎత్తున హింసాకాండకు పాల్పడ్డారు. ముఖ్యమంత్రి పెమా ఖండు ఇంటివద్ద ఘెరావ్ చేశారు. ఆయన ఇంటిపైకి రాళ్లు విసిరారు. కలిఖో పుల్ అనుచరులు ఆయన ఆత్మహత్య చేసుకున్న ఈఎస్‌ఎస్ సెక్టార్‌లోని బంగ్లా నుంచి మృతదేహాన్ని బయటకు తీసుకురానిచ్చేది లేదని, ఆ భవంతి ప్రాంగణంలోనే ఆయన శరీరాన్ని ఖననం చేయాలని డిమాండ్ చేశారు. ఆ భవనం ఎదుట పార్క్ చేసిన వాహనాలను నిప్పంటించారు.
చౌకీదార్ నుంచి సిఎం దాకా
కలిఖో పుల్ అతి సామాన్యమైన జీవితం నుంచి ప్రజలు కోరిక మేరకు రాజకీయాల్లో ఎదిగిన గొప్పనేత. 47 ఏళ్ల చిన్న వయసులోనే అర్ధంతరంగా తనువుచాలించిన కలిఖోపుల్ తన జీవితాన్ని ఓ కార్పెంటర్ వృత్తితో ప్రారంభించారు. ఆ తరువాత ఓ పాఠశాలకు చౌకీదార్‌గా పనిచేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఆంజా జిల్లాలోని వల్లా గ్రామంలో 1969 జూలై 20న జన్మించిన పుల్ కష్టపడి ఓ పక్క పని చేసుకుంటూనే మరోపక్క గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1995లో రాజకీయాల్లోకి ప్రవేశించిన పుల్ హయులియాంగ్ నియోజక వర్గంనుంచి ఎంఎల్‌ఏగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి రాష్ట్రానికి అత్యధిక కాలం ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన నేతగా రికార్డు సృష్టించాడు. గిగాంగ్ అపాంగ్, ముకుట్ మిఠి, దోర్జీఖండు మంత్రివర్గాల్లో ఆయన ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. అరుణాచల్ ముఖ్యమంత్రిగా అతి తక్కువ కాలం పనిచేసిన వ్యక్తిగా కూడా పుల్ చరిత్రలో నిలిచిపోతారు. 2016 ఫిబ్రవరిలో కాంగ్రెస్‌నుంచి చీలిపోయి బిజెపి సహాయంతో ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఆ తరువాత గవర్నర్ తీసుకున్న నిర్ణయాలను సుప్రీం కోర్టు తప్పుపట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరిగి కొనసాగించటంతో పుల్ రాజీనామా చేయాల్సివచ్చింది.