జాతీయ వార్తలు

ఏపీకి హోదాకోసం శివప్రసాద్ ‘తప్పెటగుళ్లు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఢిల్లీలో వినూత్న నిరసనకు దిగారు. మంగళవారం పార్లమెంట్ ఆవరణలో తప్పెటగుళ్లు కళాకారుడి వేషధారణలో నిరసన తెలిపారు. ప్రత్యేక హోదాతో సహా విభజన హామీలు నెరవేర్చాలని పాటద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఏపికి కేంద్రం అన్యాయం చేయొద్దని కోరారు. ఏపి ప్రజల సెంటిమెంట్‌ను నిర్లక్ష్యం చేయవద్దని, ప్రజలు ఆగ్రహిస్తే బిజెపి, టిడిపిలకు మంచిది కాదని ఆయన హెచ్చరించారు. ఏపికి ప్యాకేజీలతోపాటు ప్రత్యేక హోదా కూడా ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.

‘విభజనకు జగనే కారణం’

న్యూఢిల్లీ, ఆగస్టు 9: వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి అధికార దాహంవల్లే రాష్ట్ర విభజన జరిగిందని టిడిపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ ఆరోపించారు. రాజశేఖరరెడ్డి చనిపోయిన తరువాత జగన్ ముఖ్యమంత్రి పదవికోసం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశారని ధ్వజమెత్తారు. ఎపి ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ కారణం జగన్మోహన్‌రెడ్డేనని టిజి చెప్పుకొచ్చారు. ప్రతి దానికీ చంద్రబాబును తప్పుపట్టటం సరికాదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం కేంద్రంతో స్నేహపూర్వకంగా ఉండాలని, ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపితో విభేదిస్తే అసలుకే మోసం వస్తుందని అన్నారు. ప్రత్యేక హోదాకోసం కెవిపి రామచందర్‌రావు చేసే పోరాటంలో నిజాయితీ ఉందని, కాని ఢీల్లీలో కాంగ్రెస్ నాయకులు ఆయనను మోసం చేశారని వెంకటేష్ విమర్శించారు.
విభజన హామీలకోసం జగన్ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలవడంవల్ల ఉపయోగం లేదన్నారు. ఎపికి ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీ వస్తే మంచిదేనని ఆయన అన్నారు.