జాతీయ వార్తలు

జైట్లీపై సభాహక్కుల నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వకూడదని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిందంటూ రాజ్యసభను తప్పుదోవ పట్టించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీపై చర్య తీసుకోవాలంటూ కాంగ్రెస్ ఎంపీలు కెవిపి రామచందర్‌రావు, జైరాం రమేష్, సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి సభా హక్కుల నోటీసు ఇచ్చారు. అరుణ్ జైట్లీ జూలై 29 తేదీన రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చ జరిగినప్పుడు జోక్యం చేసుకుని 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. అయితే 14వ ఆర్థిక సంఘం తమ సిఫార్సుల్లో ఎక్కడా ప్రత్యేక హోదా వ్యవస్థను రద్దు చేయాలని సూచించలేదని వారానోటీసులో స్పష్టం చేశారు. నిధుల కేటాయింపుకోసం తాము రాష్ట్రాలను వర్గీకరించటం లేదని మాత్రమే ఆర్థిక సంఘం పేర్కొందని వారు గుర్తుచేశారు. ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జాతీయ అభివృద్ధి మండలి ధ్రువీకరించిందని ముగ్గురు నాయకులు తమ లేఖలో పేర్కొన్నారు. అరుణ్‌జైట్లీ రెండు అంశాల్లో కూడా రాజ్యసభను తప్పుదోవ పట్టించారని వారు హమీద్ అన్సారీకి రాసిన లేఖలో ఆరోపించారు.

ఎన్‌డిఏ ప్రభుత్వంలో
బిసిలకు అన్యాయం: విహెచ్

న్యూఢిల్లీ, ఆగస్టు 9: ఓబిసి ప్రధాని కేంద్రంలో వచ్చిన బలహీన వర్గాల సమస్యలు పరిష్కారం కావడం లేదని కాంగ్రెస్ నేత వి హనుమంతరావు విమర్శించారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయలేదని ఆరోపించారు. ఎన్‌డియే ప్రభుత్వంలో బిసిలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల్లోకి వెళ్లి వెనుకబడిన కులాల పట్ల నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వివరిస్తామని ఆయన వెల్లడించారు.