జాతీయ వార్తలు

స్వరాజ్‌ను సురాజ్‌గా మార్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 9: క్విట్ ఇండియా ఉద్యమం వ్రజోత్సవం (75వ సంవత్సరం) ఉత్సవాలను పురస్కరించుకుని మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం పలు సామాజిక రుగ్మతలపై పోరాడడానికి అలాగే సురాజ్ (సుపరిపాలన)ను తీసుకు రావడానికి ‘క్విట్‌ఇండియా ఉద్యమం-2’ను ప్రారంభించింది. 1942లో ఇదే రోజున మహాత్మాగాంధీ ‘క్విట్ ఇండియా’ పిలుపునిచ్చిన ముంబయిలోని ఆగస్ట్ క్రాంతిమైదాన్‌లో జరిగిన కార్యక్రమం ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ‘68ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత దేశాన్ని పట్టి పీడిస్తున్న వివిధ సామాజిక రుగ్మతలను దేశంనుంచి తరిమికొట్టడానికి, భారతదేశాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి దేశ ప్రజలు అదే స్ఫూర్తి, ఉత్సాహంతో స్పందించాల్సిన అవసరముంది’ అని అన్నారు. దేశాన్ని ‘స్వరాజ్’నుంచి ‘సురాజ్’వైపు తీసుకెళ్లడానికి నిరక్షరాస్యత, వివక్ష, అనైక్యత, అసామరస్యం, ఉగ్రవాదం, జాతి వ్యతిరేక భావంలాంటి సామాజిక రుగ్మతలకు ‘క్వింట్ ఇండియా’ చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దేశంనుంచి పేదరికాన్ని తరిమికొట్టాలని, అందరికీ విద్యను అందించడం, ఉపాధి కల్పించడం, సంక్షేమ పథకాలతో అభివృద్ధిని మిళితం చేయడం అన్నీ కూడా ‘క్విట్ పావర్టీ’ ఉద్యమంలో భాగమేనని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరు కూడా చేయూతనందించాలని వెంకయ్య విజ్ఞప్తి చేశారు.
దేశం అన్ని రంగాల్లోను అభివృద్ధి సాధించాలంటే ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నినాదమైన ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్’ అంతరార్థం ఇదేనని చెప్పారు. దేశ పౌరుల్లో దేశ భక్త్భివాన్ని తిరిగి రగిలించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని ‘ఆజాదీ 70సాల్-జరా యాద్ కరో కుర్బానీ’గా నిర్వహిస్తోందని, స్వాతంత్య్ర ఉద్యమంతో ముడిపడిన జలియన్‌వాలాబాగ్, చౌరిచౌర, సెల్యులర్ జైలు, సబర్మతి ఆశ్రమం, దండిలాంటి రెండు చారిత్రక ప్రదేశాలను సందర్శించే బాధ్యతను కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అప్పగించారని వెంకయ్య నాయుడు చెప్పారు.

క్విట్ ఇండియా వజ్రోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ముంబయిలోని ఆగస్ట్ క్రాంతిమైదాన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. చిత్రంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తదితరులు