జాతీయ వార్తలు

స్వేచ్ఛను ఆస్వాదించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భభ్రా (మధ్యప్రదేశ్), ఆగస్టు 9: నెల రోజులకు పైగా అల్లర్లతో అట్టుడుకుతున్న కాశ్మీర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా పెదవి విప్పారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి చూపించిన ఇన్సానియత్ (మానవత్వం), జమురియత్ (ప్రజాస్వామ్యం), కశ్మీరీయత్ (కాశ్మీర్ ప్రజల మనోభావాలు) ఆధారంగా చర్చలు జరపడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ల్యాప్‌టాప్‌లు, పుస్తకాలు, క్రికెట్ బ్యాట్లు పట్టుకోవాల్సిన కాశ్మీర్ కుర్రాళ్లు రాళ్లు పట్టుకోవడం బాధాకరమని, భూతలస్వర్గమైన కాశ్మీర్‌లో శాంతి, సామరస్యాలను కాపాడాలని వారికి విజ్ఞప్తి చేశారు. దేశంలోని అందరికీ ఉండే స్వాతంత్య్రం కాశ్మీర్‌లోని వారికికూడా ఉందని ఆయన స్పష్టం చేస్తూ, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం, బిజెపి భాగస్వామిగా ఉన్న మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం కలిసి కృషి చేస్తున్నాయన్నారు. అయితే కొంతమంది దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే హింసామార్గానే్న పట్టుకు వేళ్లాడుతున్నారన్నారు. అటల్ బిహారీ వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో నడిచిన బాటలోనే తమ ప్రభుత్వం కూడా నడుస్తోందన్నారు. ‘మన స్వాతంత్య్ర సమరయోధులు దేశంలోని మిగతా ప్రాంతాలకు అందించిన బలమే కాశ్మీర్‌కు కూడా ఉంది, ప్రతి భారతీయుడూ అనుభవిస్తున్న స్వాతంత్య్రమే కాశ్మీరీలకు కూడా ఉందని స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జన్మస్థలంనుంచి కాశ్మీర్‌లోని సోదర సోదరీమణులకు నేను హామీ ఇస్తున్నాను’ అని ప్రధాని అన్నారు. జమ్మూ, కాశ్మీర్ అభివృద్ధి కోసం, అక్కడి ప్రజల భవిష్యత్తుకోసం కృషి చేస్తున్నామని, అయితే అక్కడ కొంతమంది ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
కాశ్మీర్ సమస్యపై ఒకే గొంతుతో మాట్లాడుతున్నందుకు మిగతా రాజకీయ పార్టీలను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఆయన ప్రశంసిస్తూ ఇదే భారతదేశ బలమన్నారు. ఈ బలంతోనే ముందుకు వెళ్లాలని తాము అనుకుంటున్నామన్నారు. కాశ్మీర్ అభివృద్ధికోసం కేంద్రంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, లాయర్లు, డాక్టర్లు, పర్యాటకం, యాపిల్ తోటలపై ఆధారపడిన వారి జీవన పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. భారతీయులకు కాశ్మీర్ అంటే భూతలస్వర్గంతో సమానమని, జీవితంలో ఒక్కసారయినా కాశ్మీర్ వెళ్లాలని ప్రతిఒక్కరూ కలలు కంటారని, అయితే కాశ్మీర్‌లోని కొద్దిపాటి మంది ఈ సంప్రదాయాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.
చంద్రశేఖర ఆజాద్‌కు నివాళి
క్విట్ ఇండియా 75వ వార్షికోత్సవం సందర్భంగా చంద్రశేఖర్ ఆజాద్ జన్మస్థలమైన మధ్యప్రదేశ్‌లోని భభ్రాలో 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బిజెపి ’ 70, ఆజాదీ యాద్ కరో, కుర్బానీ’ పేరుతో 15 రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. అంతకు ముందు ప్రధాని మోదీ ఆజాద్ స్వగ్రామమైన భభ్రా ఆయన విగ్రహం వద్ద పుష్పాలు ఉంచి నివాళులర్పించారు. ఆజాద్ జ్ఞాపకార్థం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ గ్రామాన్ని చంద్రశేఖర్ ఆజాద్ నగర్‌గా మార్చింది. ఆయన నివాసాన్ని స్మృతిచిహ్నంగా మార్చింది. అక్కడే ఆజాద్ జీవిత విశేషాలలను తెలియజేసే ఒక మ్యూజియంను కూడా ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ మంగళవారం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి ఆ మ్యూజియంను సందర్శించారు.
ఆచితూచి స్పందించిన ఎన్‌సి
శ్రీనగర్: కాగా, జమ్మూ, కాశ్మీర్‌లో నెలరోజులుగా సాగుతున్న హింసకు ముగింపు పలకడానికి చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా చేసిన ప్రకటనపై కాశ్మీర్‌లో ప్రధాన ప్రతిపక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్ ఆచితూచి స్పందించింది. కేవలం మాటలు చాలవని, చేతలకోసం తాము ఎదురు చూస్తున్నామని ఆ పార్టీ వ్యాఖ్యానించింది. నేషనల్ కాన్ఫరెన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రధాని వ్యాఖ్యలపై ట్విట్టర్‌లో ‘ఫైనల్లీ’ అనే ఒక్క మాటతో స్పందించగా, ఆ పార్టీ అధికార ప్రతినిధి మాత్రం కాశ్మీర్ ప్రజలు చాలాకాలంగా మాటలతో విసిగి పోయి ఉన్నారని, ప్రధాని వ్యాఖ్యలు చేతల్లో కార్యరూపం దాలుస్తాయన్న ఆశతో వారు ఎదురు చూస్తున్నారని అన్నారు.
chitram...
మధ్యప్రదేశ్‌లోని భభ్రాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతున్న మోదీ

స్వాతంత్య్ర సమర యోధుడు చంద్రశేఖర ఆజాద్ జీవిత చరిత్రకు సంబంధించిన ప్రదర్శనను తిలకిస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్