జాతీయ వార్తలు

దేశ సమగ్రతకు పునరంకితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, సమైక్యతకోసం పునరంకితం కావాలని పార్లమెంటు ప్రకటించింది. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా దేశంకోసం అశువులుబాసిన సమరయోధులకు మంగళవారం పార్లమెంటు ఘన నివాళులర్పించింది. జాతిపిత మహాత్మాగాంధీ, స్వాతంత్య్ర సమరయోధులకు సభ ఘనంగా అంజలి ఘటించింది. దేశ చరిత్రలో ఈ రోజు చిరస్మరణీయమని రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ స్పష్టం చేశారు. దేశంకోసం ప్రాణాలర్పించిన త్యాగధనుల ఆశయాలను అనుగుణంగా పనిచేస్తూ సమాజం, దేశాభివృద్ధికి పాటుపడడమే వారికి సరైన నివాళి అని ఆయన ఉద్ఘాటించారు. ‘దేశ సమగ్రత, సమైక్యత, సార్వభౌమాధికారం కోసం పునరంకితం కావాలి’ అని ఉప రాష్టప్రతి పిలుపునిచ్చారు. మహాత్ముడి క్విట్ ఇండియా పిలుపునందుకుని జాతి యావత్తును ఒకే తాటిపైకి వచ్చి బ్రిటిష్ పాలకులను గడగడలాడించిందని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు.

క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులకు ఉభయ సభలూ నివాళులర్పించాయి. సభ్యులు కాసేపు వౌనం పాటించారు.