జాతీయ వార్తలు

ముమ్మాటికీ మాదే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10:ప్రపంచంలో ఏ శక్తీ భారత్ నుంచి కాశ్మీర్‌ను విడదీయలేదని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. కాశ్మీర్‌లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న అల్లర్లు, హింసాకాండకు పాకిస్తానే కారణమని తెగేసి చెప్పారు. కాశ్మీర్ పరిస్థితిపై బుధవారం రాజ్యసభలో విస్తృతంగా చర్చ జరిగింది. ‘కాశ్మీరీల బాధను మేము అర్థం చేసుకున్నాం..వారి ఆవేదనతో పాలుపంచుకుంటున్నాం’ అంటూ ఏకగ్రీవంగా సభ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. శాంతి, సామరస్యాలను పరిరక్షించడంలో సహకరించాలంటూ ఆ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసింది. మితవాద నేతలు, ఇతర వర్గాలతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. అదే క్రమంలో శుక్రవారం కాశ్మీర్‌పై అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడానికీ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. దాదాపు ఆరు గంటల పాటు జరిగిన చర్చ అనంతరం కాశ్మీర్ ప్రజలకు సంఘీభావం తెలుపుతూ సభ ఏకగ్రీవ తీర్మానం చేపట్టింది. జాతీయ భద్రతపై రాజీ పడేది లేదని..ఎలాంటి జాప్యం లేకుండా కాశ్మీర్‌లో శాంతి భద్రతల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఈ తీర్మానంలో స్పష్టం చేశారు. వివిధ పార్టీలకు చెందిన 29మంది సభ్యులు ఈ చర్చలో పాల్గొన్నారు. ఈ చర్చకు సమాధానం చెప్పిన హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్ కాశ్మీర్‌పై రాజీ పడేది లేదన్నారు. అలాగే ఆ రాష్ట్రాన్ని సైన్యానికి అప్పగించే ఆలోచన కూడా తమకు లేదన్నారు. ఈ విషయంలో ఉద్దేశపూర్వకంగానే వదంతులు సృష్టిస్తున్నారంటూ విరుచుకు పడ్డారు. తాను ప్రధాని నరేంద్ర మోదీ తరపున మాట్లాడుతున్నానని చెప్పిన రాజ్‌నాథ్ కాశ్మీర్ పరిస్థితిపై శుక్రవారం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ సమావేశానికి ప్రధాని మోదీ కూడా హాజరవుతారని తెలిపారు. అల్లర్లను అదుపు చేసే విషయంలో గరిష్ఠ స్థాయిలో సంయమనాన్ని పాటించాలని భద్రతా దళాలకు ఆదేశాలు జారీ చేసినట్టు రాజ్‌నాథ్ తెలిపారు. అయితే జాతీయ భద్రత, పాకిస్తాన్ అనుకూల నినాదాల విషయంలో రాజీలేదని, ఇందుకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాకిస్తాన్‌తో ఎలాంటి చర్చలు జరిపినా అవి ఆ దేశ ఆక్రమించుకున్న ప్రాంతాలపైనే జరుగుతాయని..కాశ్మీర్‌ను మాత్రం ఏ శక్తీ భారత్ నుంచి విడదీయలేదని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. కాశ్మీర్‌పై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలంటూ ఐక్యరాజ్య సమితీకి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ రాసిన లేఖను హోం మంత్రి ప్రస్తావించారు. కాశ్మీర్‌లో రాజకీయ ప్రక్రియను చేపట్టాలన్న సభ్యుల డిమాండ్‌పై స్పందించిన రాజ్‌నాథ్ ప్రధాన పార్టీలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఎక్కడి నుంచి చర్చల ప్రక్రియను మొదలు పెట్టాలి, ఎవరితో మాట్లాడాలన్న దానిపై కాశ్మీర్ ముఖ్యమంత్రిని కోరతానని తెలిపారు. అమర్‌నాథ్ యాత్ర ముగిసిన తర్వాత కాశ్మీర్‌ను సైన్యానికి అప్పగిస్తారంటూ కథనాలు వెలువడుతున్నాయంటూ గులాం నబీ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన రాజ్‌నాథ్ ‘అసలు ఇలాంటి ఆలోచనే ప్రభుత్వానికి లేదు. ఈ రోజుల్లో సామాజిక మీడియాలో ఏమైనా చెప్పొచ్చు’అని అన్నారు.