జాతీయ వార్తలు

కోరం లేక వెలవెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: రాజ్యసభ, లోక్‌సభ నిర్వహణకు కనీస సంఖ్యలో కూడా సభ్యుల హాజరీ లేకపోవడం వల్ల ఉభయ సభలు శుక్రవారం అర్ధంతరంగా వాయిదా పడ్డాయి. పలుసార్లు వాయిదాపడ్డ అనంతరం మధ్యాహ్నం 2.30కు రాజ్యసభ సమావేశమైంది. అనంతరం అనధికార బిల్లులను చేపట్టేందుకు చైర్మన్ ప్రయత్నించారు. అదే సమయంలో రాజ్యాంగ (షెడ్యూలు కులాల) ఉత్తర్వును సవరించేందుకు ఉద్దేశించిన ఓ బిల్లుపై ఓటింగ్‌ను చేపట్టారు. అయితే బిజెపి, కాంగ్రెస్ సభ్యులు బయటకు వెళ్లిపోయారు. సభ్యులందరూ ఇలా వెళ్లిపోతే నేనేం చేయగలనంటూ డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను వాయిదా వేశారు. ఆ సమయంలో సభలో 19మంది సభ్యులే ఉన్నారు. కనీస పక్షంగా 25మంది సభ్యులుంటే తప్ప సభను నిర్వహించలేరు. అంటే 250మంది సభ్యులు కలిగిన రాజ్యసభలో కోరం నిబంధన ప్రకారం 10శాతం మంది సభ్యులుండాలి. దాదాపు ఇదే పరిస్థితి లోక్‌సభలోనూ ఎదురైంది. నిర్బంధ ఓటింగ్‌కు సంబంధించి ఓ అనధికార బిల్లుపై చర్చ జరిగిన సమయంలో కనీస సభ్యులు కూడా సభలో లేరు. దాంతో అధ్యక్ష స్థానంలో ఉన్న బుకుం నారాయణ యాదవ్ సభను ఐదున్నర దాకా పొడిగించారు. నిబంధనల ప్రకారం కనీసపక్షంగా 55మంది సభ్యులు ఉంటేనే సభా నిర్వహణ సాధ్యమవుతుంది. చర్చ సమయంలో ఆ సంఖ్యలో సభ్యులు లేనేలేరు. కోరం బెల్‌ను అధ్యక్ష స్థానంలో ఉన్న యాదవ్ మోగించారు. దాంతో పదిమంది సభ్యులు మాత్రమే సభలోకి వచ్చారు. అయినప్పటికీ కోరం పూర్తికాకపోవడంతో సభను వాయిదా వేశారు. ఇలా ఏకకాలంలో బిల్లులపై చర్చ జరుగుతున్న సమయంలో కనీస సభ్యులు కూడా పార్లమెంటు ఉభయ సభల్లోనూ లేకపోవడం విచిత్రమే!
chitram...
సభ్యులు హాజరుకాకపోవడంతో ఖాళీగా దర్శనమిచ్చిన రాజ్యసభ