జాతీయ వార్తలు

థాంక్యూ మోదీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 13: పాకిస్తాన్ గనుక కాశ్మీర్ విషయంలో తలదూర్చడం, అక్కడ హింసను, ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడం మానక పోతే బలూచిస్థాన్‌లో ఆ ప్రభుత్వం పాల్పడుతున్న అకృత్యాలను తాము బైటపెట్టాల్సి వస్తుందంటూ ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం చేసిన హెచ్చరిక బాగానే పని చేస్తున్నట్లు కనిపిస్తోంది. మోదీ చేసిన వ్యాఖ్యలను బలూచిస్థాన్‌లో పలువురు మానవ హక్కుల ఉద్యమకారులు స్వాగతించడమే కాక పాక్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘మీరు (ప్రధాని మోదీ) ఇస్తున్న మద్దతుకుగాను బలూచిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్‌లో మేమంతా కృతజ్ఞతలు చెప్తున్నాం’ అని వరల్డ్ బలూచ్ ఉమెన్స్ ఫోరమ్ అధ్యక్షురాలు నీలా ఖాద్రి బలూచ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఒక వార్తాసంస్థ తెలిపింది. బలూచిస్థాన్ ప్రజలు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారని ఇంటర్వ్యూలో చెప్పిన ఆమె వచ్చే సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్య సమితి సమావేశంలో మీరు ఈ విషయాన్ని లేవనెత్తుతారని తాంతా ఆశిస్తున్నామని ప్రధాని మోదీకి పంపిన సందేశంలో ఆమె అన్నారు.
1971లో బంగ్లాదేశ్‌లో జోక్యం చేసుకున్నట్లుగా బలూచిస్థాన్‌లో కూడా భారత్ జోక్యం చేసుకోవాలని పదేపదే కోరుతున్న బలూచిస్థాన్‌కు చెందిన ప్రముఖ ఉద్యమకారుల్లో నీలా ఖాద్రి ఒకరు. కాగా, బలూచిస్థాన్‌కు మద్దతు తెలుపుతూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనను తాము స్వాగతిస్తున్నామని బలూచిస్థాన్ ప్రజలకు మద్దతు తెలపాలన్న ఆకాంక్షను ఒక భారత ప్రధానమంత్రి వ్యక్తం చేయడం ఇదే ప్రథమమని, ఇది చాలా కీలకమైన నిర్ణయమని బలూచ్ నేషనల్ మూవ్‌మెంట్ ప్రతినిధి హమ్మల్ హైదర్ అన్నారు.