జాతీయ వార్తలు

రెప్పవాల్చని నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 14: డబ్భయ్యవ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే ఢిల్లీలోని ఎర్రకోట సహా దేశవ్యాప్తంగా భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. కాశ్మీర్ లోయలో గత కొన్ని రోజులుగా హింసాకాండ చెలరేగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వని రీతిలో భద్రతను పటుతరం చేశారు. 17వ శతాబ్దం నాటి ఎర్రకోట బురుజుల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్న దృష్ట్యా ఢిల్లీలో రక్షణ, భద్రత చర్యలను అనూహ్యరీతిలో విస్తృతం చేశారు. అనేక మంది దేశీయ, విదేశీ ప్రముఖులు ప్రధాని ప్రసంగ కార్యక్రమానికి హాజరుకానున్న దృష్ట్యా భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా అధికారులు ముందునుంచే అప్రమత్తమయ్యారు. ఎర్రకోటలో జరిగే కార్యక్రమానికి లక్షలాదిగా జనం తరలివచ్చే అవకాశం ఉండటంతో నిఘాతోపాటు తనిఖీలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఏడు రోజుల సాంస్కృతిక ఉత్సవం ‘్భరత్‌పర్వ్’ కొనసాగుతున్న దృష్ట్యా రాజ్‌పథ్ అంతటా అనేక పాఠశాలల్లో భద్రతను ఏర్పాటు చేశారు. నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, ఇతర ప్రభుత్వ భవనాలు సర్వాంగ సుందరంగా కనిపించడంతో ఈ ప్రాంతాన్ని చూసేందుకు జనం పెద్దసంఖ్యలో తరలివస్తున్న దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నారు. కాశ్మీర్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేని రీతిలో భారీఎత్తున పారామిలిటరీ, పోలీసు బలగాలను భక్షి స్టేడియానికి తరలించారు. ఈ ప్రాంతంలోనే ప్రధాన కార్యక్రమం జరగనున్న దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అలాగే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగే ఎర్రకోట వద్ద పహరా కాస్తున్న ఓ జవాను