జాతీయ వార్తలు

కాశ్మీరీల హక్కును అణచలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 14: గత కొన్ని రోజులుగా కాశ్మీర్ విషయంలో భారత్‌ను రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్న పాకిస్తాన్ మరింతగా కవ్వించు చర్యలకు పాల్పడింది. ఈసారి తమ స్వాతంత్య్ర దినోత్సవాన్ని కాశ్మీర్ ప్రజల స్వేచ్ఛకోసం అంకితం చేస్తామని, వారికి దౌత్యపరంగా, నైతికంగా, రాజకీయంగా కూడా మద్దతునిస్తామని భారత్‌లోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ వివాదాస్పద ప్రకటన చేశారు. మరికొన్ని గంటల్లో భారతదేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్న తరుణంలోబాసిత్ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కాశ్మీర్‌పై చర్చల ప్రసక్తి లేదని, సీమాంతర ఉగ్రవాదాన్ని కట్టిపెట్టాలని భారత్ తెగేసి చెప్పిన నేపథ్యంలో బాసిత్ ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. జమ్ముకాశ్మీర్‌కు సంబంధించినంతవరకు పాకిస్తాన్ తన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అక్కడి ప్రజల పోరాటానికి అంకితం చేస్తోందని ఇక్కడి తమ ఎంబసీలో జరిగిన ఒక కార్యక్రమంలో బాసిత్ అన్నారు. స్వాతంత్య్రం కోసం జమ్ముకాశ్మీర్ ప్రజలు చేసిన త్యాగాలు వృధాకావని పేర్కొన్నారు.
ఆ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న అశాంతికి అడ్డుకట్ట వేయాలని పేర్కొన్న బాసిత్ కాశ్మీర్ ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కుకు వెన్నుదన్నుగా నిలుస్తామని, ఇందుకోసం వారు చేసే పోరాటాన్ని అన్ని విధాలా బలపరుస్తామని చెప్పారు. ఎంతగా అణచివేసే చర్యలకు పాల్పడ్డా కాశ్మీర్ ప్రజల రాజకీయ ఆకాంక్షను అణగదొక్కలేరన్నారు. ఎప్పటికైనా వారి స్వాతంత్య్ర పోరాటం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందని అన్నారు. భారత్‌తో మంచి సంబంధాలనే పాక్ కోరుకుంటూ వచ్చిందని, అదే విధంగా ద్వైపాక్షిక వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలనే ఆకాంక్షించిందని ఆయన తెలిపారు.

ప్రస్తుతం పాకిస్తాన్ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నా ఏ శక్తీకూడా దానిని నీరుగార్చజాలదని అన్నారు.

పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలోని పాక్ హైకమిషనర్ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతున్న అబ్దుల్ బాసిత్