జాతీయ వార్తలు

పెల్లెట్ గన్స్‌ను నిషేధిస్తే ప్రత్యామ్నాయం తుపాకులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఆగస్టు 19: జమ్మూ, కాశ్మీర్‌లో ఆందోళనకారులను నియంత్రించేందుకు పెల్లెట్ గన్స్‌ను వాడొద్దంటే తమ ముందు తుపాకులు మాత్రమే ప్రత్యామ్నాయంగా ఉంటాయని, దీనివల్ల మరిన్ని మరణాలు సంభవించే ప్రమాదం ఉందని సిఆర్‌పిఎఫ్ జమ్మూ, కాశ్మీర్ హైకోర్టుకు తెలియజేసింది.‘ ఒక వేళ పెల్లెట్ గన్స్‌ను నిషేధించినట్లయితే సిఆర్‌పిఎఫ్‌కు రైఫిల్స్‌తో కాల్పులు జరపడం తప్ప మరో మార్గం ఉండదు. దానివల్ల మరింత ఎక్కువ ప్రాణనష్టం సంభవించవచ్చు’ అని సిఆర్‌పిఎఫ్ బుధవారం హైకోర్టుకు సమర్పించిన ఒక అఫిడవిట్‌లో తెలిపింది. జమ్మూ, కాశ్మీర్‌లో ఆందోళనకారులను అదుపు చేయడానికి పెల్లెట్ గన్స్‌ను వాడడాన్ని నియంత్రించాలని కోరుతూ దాఖలయిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను హైకోర్టు విచారించిన సందర్భంగా సిఆర్‌పిఎఫ్ పెల్లెట్ గన్స్‌ను వాడాల్సిన అవసరాన్ని వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. 2010లో పెల్లెట్స్ గన్స్‌ను ప్రవేశపెట్టారని, కాశ్మీర్ లోయలో ఆందోళనకు దిగే జనం గుంపులను అదుపు చేయడానికి ఒక మార్గంగా అందరూ అంగీకరిస్తున్నారని కూడా సిఆర్‌పిఎఫ్ తెలిపింది. నిబంధనలప్రకారం ఆందోళనకారులను అదుపు చేసేందుకు తుపాకులను వాడాల్సి వస్తే నడుం కింది భాగంలోనే కాల్పులు జరపాలని, అయితే కాశ్మీర్‌లో పరిస్థితి భిన్నంగా ఉందని, వీధుల్లోకి వచ్చి అటూ, ఇటూ పరుగెడుతూ అల్లర్లకు పాల్పడే ఆందోళనకారులను గురి చూసి నడుం కింది భాగంలోనే కాల్చడం సాధ్యపడకపోవచ్చని, అలాంటి సందర్భాల్లో మరింత ఎక్కువ ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని సిఆర్‌పిఎఫ్ ఆ అఫిడవిట్‌లో తెలియజేసింది. కాశ్మీర్ లోయలో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనల సందర్భంగా గత జూలై9నుంచి ఆగస్టు 11 వరకు దాదాపు 3,500 పెల్లెట్ కార్టిడ్జ్‌లను వాడినట్లు సిఆర్‌పిఎఫ్ తెలియజేసింది. కాశ్మీర్ హైకోర్టు బార్ అసోసియేషన్ ఈ పిల్‌ను దాఖలు చేసింది. సిఆర్‌పిఎఫ్, బిఎస్‌ఎఫ్‌లు హైకోర్టు నోటీసులకు తమ సమాధానాలను దాఖలు చేయగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా దాఖలు చేయలేదు. కాగా, ఈ కేసు విచారణ శనివారం కూడా జరగనుంది.

పాక్ గూఢచారి అరెస్టు
జైపూర్, ఆగస్టు 19: ఇండో-పాక్ సరిహద్దులోని జైసల్మార్ వద్ద ఓ పాకిస్తాన్ జాతీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. పట్డుబడిన 26 ఏళ్ల నందలాల్ మేఘ్వాల్ పాక్ ఐఎస్‌ఐ గూఢచారని రాజస్థాన్ పోలీసులు అనుమానిస్తున్నారు. పాకిస్తాన్‌లోని సంగాడ్ జిల్లాకు చెందిన అతడు వీసాపై ఈనెల ఆరంభంలోనే భారత్‌లో ప్రవేశించినట్టు వెల్లడించారు. జైసల్మార్‌లోని ఓ హోటల్‌లో బసచేసిన అతడు దేశానికి సంబంధించిన సమాచారం రహస్యంగా సేకరిస్తున్నట్టు తెలిసింది. వెంటనే హోటల్‌పై దాడి చేసి మేఘ్వాల్‌ను అరెస్టు చేసినట్టు ఇంటిలిజెన్స్ ఎడిజి యుఆర్ సాహూ తెలిపారు. గురువారం రాత్రే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరింత లోతుగా విచారణ జరిపేందుకు జైపూర్ తీసుకెళ్లినట్టు ఆయన వివరించారు. ప్రాధమిక విచారణలో నిందితుడు పాక్‌తో సత్సంబంధాలు కలిగి ఉన్నట్టు వెల్లడైంది. అసాంఘిక శక్తులు, స్మగ్లర్లతో కలిసి రాజస్థాన్ సరిహద్దు ప్రాంతంలో కార్యకలాపాల్లో పాల్గొనేవాడు. దేశ రక్షణశాఖకు సంబంధించిన పలు అంశాలు పాక్ ఐఎస్‌ఐకు చేరవేసేవాడని ఇంటిలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. నిందితుడు వాట్సప్,ఫేస్‌బుక్,స్కైపేలను వినియోగించుకున్నట్టు ఆధారాలు లభించాయి. వీసాపై అనేక సార్లు పర్యటించాడని హోమ్‌మంత్రి గులాబ్‌చంద్ కటారియా తెలిపారు. అతడు వీసా నిబంధనలను ఉల్లంఘించాడని సిఐడి అడిషనల్ ఎస్‌పి రాజీవ్‌దత్ చెప్పారు.