జాతీయ వార్తలు

సరిహద్దుల్లో పటిష్ఠమైన నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పసిఘాట్, ఆగస్టు 19: అరుణాచల్ ప్రథేశ్ భూభాగంలోకి చైనా సైన్యం ఇటీవల రెండు సార్లు దురాక్రణకు ప్రయత్నించిందని కేంద్ర హోమ్‌శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. శుక్రవారం ఇక్కడ అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్స్‌ను ప్రారంభించిన మంత్రి జూలై 22న అంజ్వా జిల్లాలోని మారుమూల కిబితు ప్రాంతంలో చైనా సైన్యం చొరబడే ప్రయత్నం చేసిందన్నారు. అదే నెలలో తవాంగ్ జిల్లా తంగ్సాలోనూ దురాక్రమణకు యత్నించినట్టు రిజిజు స్పష్టం చేశారు. ఇది కాకతాళీయంగా జరిగింది కాదని, పొరుగుదేశం పథకం ప్రకారమే దుశ్చర్యకు పాల్పడినట్టు ఆయన చెప్పారు.
చైనా సైన్యం వాస్తవాధీన రేఖ దాటి అరుణాచల్ ప్రదేశ్‌లోకి ఆక్రమణ జరిపినట్టు సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇండో టిబెట్ బోర్డర్ పోలీసుల నివేదిక ప్రకారం కేంద్రం అప్రమత్తమైందని రిజిజు వెల్లడించారు. అయితే రెండుచోట్ల చైనా సైన్యం ఈ చర్యకు పాల్పడినట్టు నిర్థారణ అయినట్టు మంత్రి వివరించారు. సరిహద్దు వెంబడి చైనా సైన్యం వౌలిక సదుపాయాలు సమకూర్చుకుంటున్నట్టు వచ్చిన వార్తలను ఆయన దృష్టికి తీసుకురాగా‘కేంద్రం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. వాస్తవాధీనరేఖ వెంబడి బలగాలను మోహరించడంపై దృష్టి సారించింది’అని స్పష్టం చేశారు. పొరుగుదేశం నుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లలైనా తట్టుకునేందుకు భారత్ సన్నద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. కాగా సరిహద్దు ప్రాంతాల్లో వైమానిక నిఘా ఉంచినట్టు కూడా మంత్రి తెలిపారు. సరిహద్దుల భద్రత, బలగాల పటిష్టానికి ఎన్‌డిఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందని హోమ్‌మంత్రి చెప్పారు.