జాతీయ వార్తలు

కోటా మార్చే యోచన లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 19: రాజ్యాంగబద్ధంగా అమలవుతున్న రిజర్వేషన్లను కొత్త విద్యావిధానంలో మార్చే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ శుక్రవారం స్పష్టం చేశారు. కొత్త విద్యావిధానాన్ని ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదని, దీనికి సంబంధించిన ముసాయిదాను కూడా కేంద్ర కేబినెట్ తదుపరి చర్చ నిమిత్తం చేపట్టాల్సి ఉంటుందన్నారు. ముఖ్యంగా దీనిపై దేశంలోని విద్యావేత్తలు అందరితోనూ చర్చించడం ద్వారా నిర్థిష్టమైన అభిప్రాయానికి వస్తామన్నారు. ఈ తతంగమంతా ముగిసిన తరువాతే లోపరహితమైన రీతిలో విద్యా విధానం ముసాయిదా సిద్ధం చేసి కేబినెట్ పరిశీలనకు పంపిస్తామని స్పష్టం చేశారు. రిజర్వేషన్లకు సంబంధించినంత వరకూ వీటికి రాజ్యాంగబద్దత ఉందని, వీటిలో ఏరకమైన మార్పులు చేసే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని ఆయన వివరించారు. దేశంలో సమీకృత విద్యా విధానాన్ని నాణ్యతాయుతమైన బోధనా రీతుల్లో తీసుకురావాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని, ముఖ్యంగా సామాజిక న్యాయం, అధ్యాపకుల జవాబుదారీతనంపైనే ఇందులో దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు. గ్రామస్థాయినుంచి రాష్ట్రాలస్థాయి వరకూ విద్యావిధానంపై ప్రతి ఒక్కరి అభిప్రాయాలు సేకరించడం జరుగుతుందని వెల్లడించారు. సెప్టెంబర్ వరకూ ఈ విధానం విషయంలో ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించాల్సి ఉందన్నారు. పాఠశాల విద్య కోసం 13 బృందాలు, ఉన్నత, సాంకేతిక విద్య కోసం 20 బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటి వరకూ 2లక్షల పేజీలకు సరిపడా 29వేల సలహాలు, సూచనలు, సిఫార్సులు తమకు అందినట్టు వెల్లడించారు. అలాగే, అన్ని రాష్ట్రాల సిఎంల నుంచి కూడా ప్రభుత్వం మరోసారి అభిప్రాయాలు సేకరించవలసిందని వెల్లడించారు. కిండర్ గార్టెన్ నుంచి ఐఐటి స్థాయి వరకూ దేశవ్యాప్తంగా 20 లక్షలకు పైగా టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న అంశంపై కూడా జవడేకర్ మాట్లాడారు. దేశంలో విద్యా బోధన నిమిత్తం ఐదు లక్షల మంది తాత్కాలిక టీచర్లను నియమించామని, జూనియర్ కాలేజీ స్థాయిలో 85లక్షలకు పైగా లెక్చరర్లు ఉన్నారని వెల్లడించారు. అయితే, ఐఐటి స్థాయిలో కూడా కొన్ని టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్న విషయాన్ని అంగీకరించారు.