జాతీయ వార్తలు

ఆసుపత్రి నుంచి సోనియా డిశ్చార్జి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 19: స్వల్ప శస్తచ్రికిత్స కోసం ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుప్రతిలో చేరిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ డిశ్చార్జి అయ్యారు. ఈనెల ఆరంభంలో జ్వరం, అతిసార, భుజం నొప్పితో ఆమె ఇదే ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. వైద్య చికిత్సల కొనసాగింపులో భాగంగానే సోనియా మళ్లీ ఆసుపత్రిలో చేరారు. కాంగ్రెస్ అధినేత్రికి స్వల్ప శస్తచ్రికిత్స జరిగిందని గంగారాం ఆసుప్రతి చీఫ్ డాక్టర్ ఎస్‌పి బొయోత్రా వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన తెలిపారు. తొలుత రెండు మూడు రోజులు ఆసుపత్రిలోనే ఉంచాల్సి వస్తుందని వైద్యులు భావించినా, ఆరోగ్యం నిలకడగా ఉండడంతో డిశ్చార్జి చేశారు.

కాశ్మీర్‌పై ఐరాస ఆవేదన

ఇస్లామాబాద్, ఆగస్టు 19: కాశ్మీర్ విషయంలో భారత్, పాకిస్తాన్‌ల మధ్య వివాదాలు తీవ్రం కావడంపై ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఆ రాష్ట్రంలో జరుగుతున్న అలజడులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్న ఆయన, పరిస్థితులను చక్కదిద్దేందుకు ఇరు దేశాలు శాంతియుత చర్చల ప్రక్రియ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కాశ్మీర్‌లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ రాసిన లేఖపై బాన్ కీ మూన్ ప్రతిస్పందించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ హింసాకాండకు పాల్పడటానికి వీల్లేదని, సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి భారత్, పాక్‌లకు అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. కాశ్మీర్ సహా భారత్, పాక్‌ల మధ్య ఉన్న సమస్యలు పరిష్కారం కావాలంటే అందుకు చర్చలే ఏకైక మార్గమని పునరుద్ఘాటించారు.

కోల్‌గేట్ కేసులో ఐదుగురిపై
అభియోగాలు దాఖలు
న్యూఢిల్లీ, ఆగస్టు 19: బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఐదుగురు మాజీ కార్యదర్శులు, మరో ఐదుగురిపై అభియోగాలు దాఖలయ్యాయి. మోసం, నేరపూరిత కుట్ర సహా వీరిపై అభియోగాల నమోదుకు ప్రత్యేక న్యాయమూర్తి భరత్ పరాశర్ ఆదేశించారు. వీరిలో మాజీ బొగ్గు గనుల కార్యదర్శి ఎస్‌సి గుప్తా, ఇద్దరు ప్రభుత్వోద్యోగులు, ప్రయివేట్ సంస్థ వికాస్ మెటల్స్‌కు సంబంధించిన ఇద్దరు అధికారులు కూడా ఉన్నారు. ఈ కేసు దర్యాప్తును ముగించాలంటూ గతంలో సిబిఐ చేసిన సూచనను కోర్టు తిరస్కరించింది. దరిమిలా వీరందరిపైనా మళ్లీ విచారణ మొదలైంది. ఈ కుంభకోణంపై తదుపరి దర్యాప్తు జరపాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. పశ్చిమ బెంగాల్‌లోని మోయిరా, మధుజోరె బొగ్గు గనులను విఎంపిఎల్ అనే సంస్థకు కేటాయించడంపై అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి 2012లోనే సిబిఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది.

రాహుల్ గాంధీతో
ఉత్తమ్‌కుమార్ భేటీ
ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ, ఆగస్టు 19: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి రాష్ట్ర రాజకీయాల గురించి వివరించారు. రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని ఆయన రాహుల్ గాంధీకి చెప్పినట్లు తెలిసింది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం నీటిపారుదల రంగంలో అవలంభిస్తున్న తప్పుడు విధానాలను ప్రజలకు వివరిస్తున్నామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ ఉపాధ్యక్షుడికి వివరించారని అంటున్నారు. రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగానే కలుసుకున్నానని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తనను కలిసిన విలేఖరులకు చెప్పారు.