జాతీయ వార్తలు

ఆత్మహత్యాయత్నం నేరం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఆత్మహత్యకు విఫలయత్నం చేసిన వారిని శిక్షించడానికి వలస పాలన కాలం నాటి చట్టంలోని నిబంధనను సవరించాలన్న ప్రభుత్వ చర్యను న్యాయ నిపుణులు కూడా సమర్థిస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం నేరమని పేర్కొంటున్న భారత శిక్షాస్మృతి (ఐపిసి)లోని సెక్షన్ 309ను మార్చాలనే ప్రతిపాదనను వారు సమర్థిస్తున్నారు. ఇది కాలం చెల్లిన పురాతన నిబంధన అని, దీనికింద 156 ఏళ్లలో ఒక్కరికి కూడా శిక్ష పడలేదని పేర్కొంటున్నారు. ఆత్మహత్యాయత్నాన్ని నేరంగా పరిగణించకూడదన్న ప్రతిపాదనకు తాను పూర్తిగా మద్దతిస్తున్నానని సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కెటిఎస్ తులసి అన్నారు. ఈ రోజుల్లో మానసిక ఒత్తిడి వల్ల ఆత్యహత్యాయత్నాలు సాధారణం అయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రాణాలను తీసుకోవడానికి సిద్ధపడిన వ్యక్తిని శిక్షించడమేంటని ఆయన ప్రశ్నించారు.