జాతీయ వార్తలు

జైష ఆరోపణలపై విచారణకు ద్విసభ్య కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 23: రియో ఒలింపిక్స్‌లో అధికారులు ఎవరూ అందుబాటులో లేరని, తనకు గుక్కెడు మంచినీళ్లు ఇచ్చే వారుకూడా లేకపోవడంతో ఒకానొక దశలో ప్రాణాలు పోతాయేమోనని భయపడ్డానని మహిళా మారథాన్ రన్నర్ ఒపి జైష చేసిన ఆరోపణలపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. జైష చేసిన ఆరోపణలను పరిశీలించి, విచారణను జరిపి, పూర్తి సమాచారంతో నివేదిక ఇవ్వడానికి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ ప్రకటించారు. క్రీడాశాఖ డైరెక్టర్ వివేక్ నారాయణ్, జాయింట్ డైరెక్టర్ ఓంకార్ కేడియా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని చెప్పారు. మారథాన్ పరుగు సమయంలో జైష ఇబ్బందికి గురికావడం పట్ల విచారం వ్యక్తం చేశారు.