జాతీయ వార్తలు

వామ్మో! కడుపులో కత్తులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత్‌సర్, ఆగస్టు 23: కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన ఓ కానిస్టేబుల్‌కు వైద్యులు శస్తచ్రికిత్స చేయగా 40 కత్తులు బయటపడ్డారు. పంజాబ్‌లోని తరన్ తరన్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పేషంట్ కడుపులో ఇన్ని కత్తులు బయటపడడంతో వైద్యులు అవాక్కయ్యారు. సుర్జిత్ సింగ్ (40) తరన్ తరన్ జిల్లాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్న అతడు ఓ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లాడు. సింగ్ బరువు కూడా బాగా తగ్గిపోయాడు. వైద్యులు అల్ట్రాసౌండ్ స్కానింగ్‌తోపాటు పలు పరీక్షలు చేశారు. సిటి స్కాన్, ఎండోస్కోపి వంటి పరీక్షలు నిర్వహించిన తరువాత ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. కడుపు, కాలేయం, కిడ్నీలు దెబ్బతిన్నట్టు గుర్తించిన వైద్యులు ఓ దశంలో కేన్సర్ అనుకుని అనుమానించారు. మొత్తానికి ఆసుపత్రి ఎండి డాక్టర్ జితేంద్ర మల్హోత్రా సారధ్యంలోని వైద్యుల బృందం సింగ్‌కు ఆపరేష్ చేయగా కడుపులో ఏకంగా 40 కత్తులు కనిపించాయి. శస్తచ్రికిత్స తరువాత పేషెంట్ ఆరోగ్యపరిస్థితి మెరుగైందని డాక్టర్ మల్హోత్రా వెల్లడించారు.
ఆకలిగా ఉన్నప్పుడల్లా కత్తులను తినేవాడినని కానిస్టేబుల్ సుర్జిత్ సింగ్ చెప్పాడని ఆయన అన్నారు. గత రెండు నెలల్లోనే వీటిని లాగించేసేవాడు. ఇలా ఉండగా గత ఏడాది నుంచి కానిస్టేబుల్ సింగ్ మానసికస్థితి సరిగ్గా ఉండేది కాదని తెలిసింది.