జాతీయ వార్తలు

తెలంగాణలో రహదారుల విస్తరణకు కేంద్రం ఓకె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 23: తెలంగాణ రాష్ట్ర రహదారులను 650 కి.మీ మేర జాతీయ రహదారులగా విస్తరించేందుకు కేంద్రం ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలను అంగీకరించారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వినోద్‌కుమార్, బిజెపి నేత కిషన్‌రెడ్డి మంగళవారం ఇక్కడ కేంద్ర నౌక, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. జాతీయ రహదారులుగా మార్చడానికి తెలంగాణ చేసిన ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి.
సంగారెడ్డి- చౌటుప్పల్ (140కి.మీ), చౌటుప్పల్-కంది వయా అమన్‌గల్ (160 కి.మీ), మెదక్- ఎల్కతుర్తి(130 కి.మీ) రహదారి విస్తరించాలని ప్రతిపాదించారు. అలాగే హైదరాబాద్ ఔటర్‌రింగ్‌రోడ్డు- కొత్తగూడెం (220 కి.మీ) మొత్తం 650 కి.మీ మేర రాష్ట్ర రహదారులను నేషనల్ హైవేలుగా మార్చాలని నిర్ణయించారు. గడ్కరీతో సమావేశం తరువాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు గడ్కరీ సానుకూలంగా స్పందించారని అన్నారు. దీనికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకునే విధంగా అధికారులను ఆదేశిస్తానని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారని తుమ్మల తెలిపారు. కేంద్ర రహదారుల (సిఆర్‌ఎఫ్) నిధుల కింద రూ.830 కోట్లు మంజూరు చేయాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా ఉందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరిత రహదారుల పథకంలో భాగంగా రాష్ట్రం నుంచి రూ. 1,153 కోట్లుతో ప్రతిపాదనలు సమర్పించినట్టు తుమ్మల వెల్లడించారు. వీటి అనుమతులను వీలైనంత వేగంగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. రహదారుల భద్రతకు తెలంగాణ రాష్ట్రానికి రూ. 902 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరామని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ విమర్శలు హాస్యాస్పదం
తెలంగాణను సస్యశామలం చేయాలన్న ఉద్దేశంతో మహారాష్టత్రో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటుంటే ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌కు లేదని దుయ్యబట్టారు. విలేఖరుల సమావేశంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ వినోద్‌కుమార్ పాల్గొన్నారు.