జాతీయ వార్తలు

సీమాంతర కాల్పుల మృతులకు ఇక రూ. 5లక్షల పరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: సరిహద్దు ఆవలనుంచి పాకిస్తాన్ జరిపే కాల్పుల్లో మృతిచెందే జమ్మూకాశ్మీర్ ప్రజలు ఇక నుంచి రూ. అయిదు లక్షల చొప్పున నష్టపరిహారం పొం దనున్నారు. ఉగ్రవాదులు, వామపక్ష తీవ్రవాదులు జరిపే దాడుల్లో మృతిచెందిన వారిలాగే ఇకనుంచి వీరుకూ డా రూ. అయిదు లక్షల చొప్పున నష్టపరిహారం పొందుతారు. ఇప్పటివరకు సరిహద్దుల ఆ వలనుంచి జరిపే కాల్పుల్లో మృతిచెందిన వారికి నష్టపరిహారం చెల్లింపునకు ఎలాంటి పథకం లేదు. ఉగ్రవాదులు, మతతత్వ శక్తులు, వామపక్ష తీవ్రవాదులు, సీమాంతర కా ల్పులు, మందుపాతర లేదా ఐఇడి పేలుళ్లలో మృతిచెందే పౌరులకు కేంద్ర పథకం కింద ఇచ్చే పరిహారాన్ని రూ. మూడు లక్షల నుంచి అయిదు లక్షలకు పెంచడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఇక్కడ భేటీ అయిన క్యాబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. ‘మోదీ ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయమిది. కేంద్ర ప్రభుత్వం తమకోసం చర్యలు తీసుకుంటోందన్న సందేశం ఈ నిర్ణయం వల్ల బాధితులకు అందుతుంది’ అని ప్రధాని కార్యాలయం (పిఎంఒ)లో సహాయ మంత్రి అయిన జితేంద్ర సింగ్ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటిస్తూ అన్నారు.

కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలను
విలేఖరులకు వివరిస్తున్న సుష్మాస్వరాజ్