జాతీయ వార్తలు

లీకేజీతో ముప్పు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 26: భారత్ కోసం ఫ్రాన్స్ నౌకా నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఆరు స్కార్పీన్ జలాంతర్గాములకు సంబంధిం చి ఇప్పటి వరకూ వెల్లడైన వివరాల వల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. ది ఆస్ట్రేలియన్ పత్రిక వెబ్‌సైట్‌లో ప్రచురితమైన ఈ వివరాల్లో జలాంతర్గాముల ఆయుధ వ్యవస్థకు సంబంధించిన వివరాలు లేవని..ఇది ఉపశమనం కలిగించే అంశమని పేర్కొన్నారు. మీడియా కథనాల్లో వచ్చినట్టుగా ఈ వివరాలేవీ వెల్లడి కాలేదని వివరించారు. అంతేకాదు లీకైన వివరాలేవీ చాలా వరకూ అంత ఆందోళన చెందాల్సినవి కాదని నౌకాదళ అధికారులే తనకు స్పష్టం చేసిన విషయాన్నీ పారికర్ గుర్తు చేశారు. అలాగే ఇప్పటి వరకూ స్కార్పీన్ జలాంతర్గాముల పనితీరును నిర్థారించే సముద్ర పరీక్షలు కూడా జరగలేదన్నారు. అసలు ఇది ఎలా పని చేస్తుంది..్భరత అవసరాలు తీర్చగలుగుతుందా అనే వౌలిక అంశాలు నిర్థారితం కావాలంటే ముందుగా సముద్ర పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. లీకైన వివరాలు అంత ఆందోళన చెందాల్సినవి కాకపోయినప్పటికీ..ఇందుకు దారితీసిన పరిణామాలేవిటన్నదానిపై ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని వివరణ కోరుతున్నామన్నారు. ఫ్రాన్స్ నుంచి నివేదిక వచ్చిత తర్వాత తదుపరి చర్యలపై దృష్టి పెడతామని వెల్లడించారు. అలాగే..తదుపరి ఇలాంటి లీకేజీలకు తావులేకుండా అన్ని రకాలుగాను ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని పారికర్ స్పష్టం చేశారు. స్కార్పీన్ లీకేజీ వల్ల రఫాలే యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ప్రభావం పడే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ‘ఫ్రాన్స్‌కు చెందిన ఓ కంపెనీలో లీకేజీ జరిగినంత మాత్రాన ఇతర కంపెనీలతో లావాదేవీలు జరపడం ఆపేయాలంటారా..’అని పారికర్ ఎదురు ప్రశ్న వేశారు. అయితే స్కార్పీన్ లీకేజీ వ్యవహారానికి సంబంధించి సంబంధిత కాంట్రాక్టర్‌పై ఒప్పందంలోని నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని..అలాగని ఫ్రాన్స్‌తో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోకూడదన్న నిబంధన ఏమీ లేదని అన్నారు. పైగా..స్కార్పీన్ లీకేజి ఉద్దేశ పూర్వకంగా జరిగిందేమీ కాదనీ పారికర్ వివరించారు.