జాతీయ వార్తలు

దుమ్మురేపాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 26: రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న అత్యధిక స్థాయిలో 118మందికిపైగా పాల్గొన్న భారత క్రీడాకారుల్లో కేవలం ఇద్దరికి మాత్రమే పతకాలు రావడంపై గగ్గోలు రేకెత్తుతున్న నేపథ్యంలో భావి ఒలింపిక్స్‌పై కేంద్రం దృష్టి సారించింది. ప్రపంచంలో ఏ దేశానికి తీసిపోని రీతిలో భారత క్రీడాకారులను తీర్చిదిద్దే చర్యలు చేపడుతోంది. రానున్న మూడు ఒలింపిక్స్‌లలో భారత క్రీడాకారులు తమ సత్తాను చాటుకుని దేశానికి పతకాల పంట పండించే విధంగా ఓ సమగ్ర కార్యాచరణ రూపకల్పనకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఓ టాస్క్ఫోర్సును ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు. వివిధ శాఖలకు చెందిన మంత్రులు, అధికారులతో సమావేశమైన మోదీ రానున్న ఒలింపిక్స్‌పైనా దృష్టి సారించారు. 2020, 2024, 2028లలో జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారులకు అన్ని విధాలుగా తర్పీదు ఇచ్చి సుశిక్షితుల్ని చేసే విధంగా సమగ్ర కార్యారణ ఉండాలని మోదీ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన అన్ని అంశాల్ని పూర్తిగా పరిశీలించి కార్యాచరణ రూపకల్పనకు టాస్క్ఫోర్సు దోహదం చేస్తుందని వెల్లడించారు. వివిధ క్రీడలకు చెందిన నిపుణులతో కూడిన ఈ టాస్క్ఫోర్సును రానున్న కొన్ని రోజుల్లోనే ఏర్పాటుచేస్తామన్నారు. అసలు దేశంలో వివిధ రకాల క్రీడలకు అందుబాటులో ఉన్న సౌకర్యాలేమిటి..
శిక్షణ, ఎంపిక పద్ధతులేవిటి..లోపరహితమైన రీతిలో వ్యవస్థాగతమైన ఏర్పాట్లు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలేమిటన్నదానిపై ఈ టాస్క్ఫోర్సు దృష్టి పెడుతుంది. అలాగే దేశంలో మొత్తం క్రీడలకు సంబంధించి అత్యంత వ్యూహాత్మక రీతిలో కార్యాచరణను రూపొందిస్తుంది. తదుపరి ఒలింపిక్స్ 2020లో టోక్యోలో జరుగుతాయి. నిపుణులతో కూడిన టాస్క్ఫోర్సు ఇచ్చే సలహాలు, చేసే సూచనలకు అనుగుణంగానే తదుపరి కార్యాచరణ కార్యక్రమం ఉంటుందని పిఎమ్‌ఓ ఓ ప్రకటనలో తెలిపింది.