జాతీయ వార్తలు

‘పెటర్నిటి లీవు’ అంశం పరిష్కారానికీ చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 26: భవిష్యత్తులో కాబోయే తండ్రులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే రీతిలో చట్టాన్ని తీసుకురానున్నట్టు కేంద్ర స్ర్తిశిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ తెలిపారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన మెటర్నిటి బిల్లులో కాబోయే తండ్రులకు ఎలాంటి ఉపశమనం కలిగించే అంశాలు లేకపోవడంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో మంత్రి స్పందిస్తూ ఈ విషయం చెప్పారు. శుక్రవారం ఆమె ఒక జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘పాటర్నిటి లీవు కేవలం ఆటవిడుపుగా ఉంటుంది’ అని తాను వ్యాఖ్యానించినట్లు వచ్చిన వార్తలను ఖండించారు. ‘వాస్తవానికి నేను అలా చెప్పలేదు. పురుషులకు ఇదివరకే సిక్ లీవులు ఉన్నాయి. వారు పిల్లలు పుట్టినప్పుడు వాటిని వాడుకోవచ్చు. తరువాత మేము ఆ అంశాన్ని పరిష్కరిస్తాం’ అని తాను చెప్పానని వివరించారు.