జాతీయ వార్తలు

‘గ్రీన్ రివల్యూషన్’కు కుల్దీప్ సింగ్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 26: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ పర్యావరణ సంస్థకు కాపిటల్ ఫౌండేషన్ సంస్థ జస్టిస్ కుల్దీప్ సింగ్ అవార్డు ప్రకటించింది. అవార్డును సంస్థ ప్రతినిధులు శనివారం అందుకోనున్నారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు లక్ష్మారెడ్డి, లీలా లక్ష్మారెడ్డి, ఆర్ దిలీప్ రెడ్డి, నారాయణరావు, ప్రముఖ పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి శుక్రవారం నాడు ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడారు. అధ్యక్షురాలు లీలా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జస్టిస్ కుల్‌దీఫ్ సింగ్ అవార్డుకు సిజిఆర్‌ను ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. గత ఆరేళ్లుగా సిజిఆర్ ఆధ్యర్వంలో పర్యవరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. సుమారు ఆరు లక్షల మంది విద్యార్థులతో దాదాపు 30 లక్షల మొక్కలు నాటించామని వెల్లడించారు. ఆర్ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ తూర్పు కనుమల పరిరక్షణకు వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. తూర్పు కనుమల పరిధితో అనుసంధానమై ఉన్న 48 మంది ఎంపీలకు ఉత్తరాలు రాశామన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల సమయంలో ఒక సమావేశం నిర్వహిస్తామన్నారు.