జాతీయ వార్తలు

మంత్రుల పనితీరుపై మోదీ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఆగస్టు 26: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం తన మంత్రివర్గం సభ్యులతో సమావేశమై వివిధ మంత్రిత్వ శాఖల పనితీరును, ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయన్న అంశాలు సమీక్షించారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి క్యాబినెట్ మంత్రులతోపాటు సహాయ, ఇండిపెండెంట్ మంత్రులు, పిఎంఓ సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. తిరంగా యాత్ర, క్యాబినెట్ నిర్ణయాల అమలు, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై నరేంద్ర మోదీ ప్రధానంగా దృష్టి సారించారని తెలిసింది. క్యాబినెట్ మంత్రులతో పాటు ఇండిపెండెంట్, సహాయ మంత్రులు కూడా తమ పరిధిలోని అంశాలపై ఒక సమగ్ర నివేదికను నరేంద్ర మోదీ పరిశీలన కోసం అందజేసినట్లు తెలిసింది. ఈ సమగ్ర నివేదికలో తమ పరిధిలోని వివిధ పథకాల అమలు తీరు తెన్నులు వివరించటంతోపాటు అవి ఈ మేరకు ప్రజల వరకు వెళ్లాయి, దీనిపై ప్రజల స్పందన ఏమిటి అనేది కూడా మంత్రులు వివరించినట్లు చెబుతున్నారు. నరేంద్ర మోదీ కొన్ని కీలక పథకాలు అమలు జరుగుతున్న తీరుపై ఇది వరకే పిఎంఓ ద్వారా నివేదకలు సిద్ధం చేయించారు. ఆయా మంత్రులు తమ శాఖల పని తీరు, వివిధ పథకాల అమలుపై ఇచ్చిన నివేదికలను పిఎంఓ తయారు చేసిన నివేదికలతో పోల్చి చూసినట్లు చెబుతున్నారు. ఎన్‌డిఏ ప్రభుత్వం కీలక పథకాలపై పిఎమ్‌ఓ ఇప్పటికే సర్వేలు చేయించింది. ఈ సర్వేల ఆధారంగా మంత్రుల పని తీరును నరేంద్ర మోదీ అంచనా వేస్తున్నారనే మాట వినిపిస్తోంది. వివిధ శాఖల పరిధిలోని ముఖ్యమైన పథకాలు ఏ మేరకు ప్రజల వద్దకు వెళ్లాయనేది కూడా పిఎంఓ పరిశీలిస్తోంది. సర్వే ఫలితాల ఆధారంగా ఆయా పథకాలు మరింత సమర్థంగా అమలయ్యేందుకు తీసుకోవలసిన చర్యలను నరేంద్ర మోదీ సూచించినట్లు తెలిసింది. కొన్ని పథకాల అమలు పట్ల నరేంద్ర మోదీ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారనే మాట వినిపిస్తోంది.