జాతీయ వార్తలు

ఆ నివేదికను బుట్టలో వేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 26: హెచ్‌సియు రిసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు అసలు కారణాలు ఏమిటన్నదాన్ని తేల్చకుండా, అతను దళితుడా? కాదా? అనే అంశాన్ని ఉద్దేశపూర్వకంగా తెరమీదకు తెచ్చారని సిపిఐ సీనియర్ నేత కె నారాయణ మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రోహిత్ విశ్వవిద్యాలయ వ్యవస్ధగత హింసవల్లే ఆత్మహత్య చేసుకున్నాడనడానికి అనేక ఆధారాలు ఉన్నాయని తెలిపారు. రోహిత్ ఆత్మహత్యకు ప్రధాన కారణం యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావేనని ఆయన ఆరోపించారు. రోహిత్ దళితుడని గుంటూరు జిల్లా కలెక్టరే స్వయంగా అధికార పూర్వకంగా ధృవీకరించారని నారాయణ గుర్తుచేశారు. అలాగే జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ పునియా కూడా విచారించి రోహిత్ దళితుడేనని నిర్ధారించినట్టు ఆయన పేర్కొన్నారు. వాస్తవలను కప్పిపుచ్చడానికి సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వామే అలహబాద్ హైకోర్టు మాజీ జడ్జి రూపన్‌వాల్ అధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ నియమించిందని ఆయన విమర్శించారు. ఏకసభ్య కమిషన్ సుదీర్ఘంగా విచారించి కొండను తవ్వి ఎలుకను పట్టాలని ప్రయత్నించి, చివరికి తోకను కూడా పట్టలేకపోయిందన్నారు. రోహిత్ వేముల దళితుడని అంగీకరిస్తే తక్షణం విసి పొదిలి అప్పారావు జైలుకు పోవాల్సి వస్తుందన్నారు. తక్షణం రూపన్‌వాలా నివేదికను చెత్తబుట్టలో పడేయాలని సిపిఐ నేత డిమాండ్ చేశారు. గుంటూరు కలెక్టర్ ఇచ్చిన నివేదికను, ఎస్సీ కమిషన్ ఇచ్చిన నివేదికను ఆమోదించాలన్నారు.