జాతీయ వార్తలు

సారీ చెప్పాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 26: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సిందేనని ఆర్‌ఎస్‌ఎస్ డిమాండ్ చేసింది. గాంధీ హత్యకు ఆర్‌ఎస్‌ఎస్ కారణమన్న రాహుల్ గాంధీ ఆనక కోర్టు చిక్కుల్లో పడడంతో యూ టర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ తమ నాయకుడు ఎక్కడా అలాంటి వాఖ్యలు చేయలేదని సుప్రీం కోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. దీనిపై ఆర్‌ఎస్‌ఎస్ ప్రచార విభాగం చీఫ్ మన్మోహన్ వైద్య తీవ్రంగానే స్పందించారు.‘రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు కట్టిపెట్టాలి. తక్షణం క్షమాపణ చెప్పాలి’అని శుక్రవారం ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో కూడా ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయబోమని పార్టీ, రాహుల్ కూడా లిఖితపూర్వకంగా సారీ చెప్పాలని అన్నారు. కాగా ఆర్‌ఎస్‌ఎస్‌ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాహుల్ గురువారం వివరణ ఇచ్చుకున్నారు. సంఘ్‌ను ఉద్దేశించి తాను ఒక్క మాట కూడా అనలేదని ట్వీట్ చేశారు.