జాతీయ వార్తలు

రోజుకు రూ.350

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 30: జాతీయ కార్మిక సంఘాలు, బ్యాంకు ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించిన అన్ని ప్రధాన డిమాండ్లు ఆమోదిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, ఇందన మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. సెప్టెంబర్ 2న ప్రతిపాదించిన ఒకరోజు జాతీయ సమ్మెను విరమించాలని సంఘాల నేతలకు విజ్ఞప్తి చేశారు. 2014-15 ఏడాది బోనస్ ఇచ్చేందుకూ కేంద్రం అంగీకరించింది. కార్మికుల దినసరి వేతనాన్ని రూ.350గా కేంద్రం నిర్ణయించింది. అరుణ్‌జైట్లీ, బండారు దత్తాత్రేయ, పియూష్ గోయల్ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. బండారు దత్తాత్రేయ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిసి జాతీయ కార్మిక సంఘాలు, బ్యాంకు ఉద్యోగుల సంఘాలు సెప్టెంబర్ 2న చేపట్టనున్న ఒకరోజు సమ్మె గురించి వివరించారు. కార్మికులు, బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లపై తమ శాఖ తీసుకున్న నిర్ణయాలను వివరించారు. కార్మికులు, బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లను ఆమోదించాలన్న బండారు దత్తాత్రేయ ప్రతిపాదనకు మోదీ ఆమోద ముద్ర వేశారు. ప్రధానితో చర్చించిన అనంతరం తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించేందుకే అరుణ్‌జైట్లీ, బండారు దత్తాత్రేయ, పియూష్ గోయల్ మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వోద్యోగులకు సవరించిన రెండేళ్ల బోనస్‌ను త్వరలోనే విడుదల చేస్తామని జైట్లీ వెల్లడించారు. జాతీయ కార్మిక సంఘాలు, బ్యాంకు ఉద్యోగుల సంఘాలు మొత్తం పనె్నండు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ప్రతిపాదించాయి. కనీస వేతనాన్ని తొమ్మిది నుంచి పద్దెనిమిది వేలకు పెంచాలి, 2012 నుంచి పెండింగ్‌లో ఉన్న బ్యాంకు ఉద్యోగుల వేతనాలు పెంచాలి, మందులు, రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడుల నియమ నిబంధనలను సరళీకృతం చేయటాన్ని విరమించుకోవాలి, కార్మికుల రోజువారీ వేతనాన్ని 350కు పెంచాలి, ఉద్యోగులు, కార్మికులకు రెండేళ్ల బోనస్ వెంటనే విడుదల చేయాలన్నవి వారి ప్రధాన డిమాండ్లు. ఈ డిమాండ్ల సాధనకు పది జాతీయ కార్మిక సంఘాలు సెప్టెంబ్ 2న ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. దాదాపు ఐదు లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు కూడా వీరితో కలిసి సమ్మెకు సిద్ధమయ్యారు. దీంతో పరిస్థితి తీవ్రత గ్రహించిన ప్రధాని మోదీ సోమవారం రాత్రి జైట్లీ, దత్తాత్రేయ, పియూష్‌తో సమావేశమై కార్మికుల డిమాండ్లను చర్చించారు. డిమాండ్లు ఒప్పుకోవచ్చని దత్తాత్రేయ, బ్యాంకు ఉద్యోగుల వేతనాలు పెంచవచ్చని జైట్లీ సూచించినట్టు సమాచారం. ఇదిలావుంటే రక్షణ, ఔషధ రంగంలో విదేశీ పెట్టుబడుల అనుమతికి సంబంధించిన నియమ నిబంధనలు సరళీకృతం చేయకూడదన్న కార్మిక సంఘాల డిమాండును అంగీకరించటం లేదని జైట్లీ ప్రకటించారు.
సమ్మె యథాతథం
కేంద్రం తమ డిమాండ్లలో కొన్నింటిని మాత్రమే ఆమోదిచినందున సెప్టెంబర్ 2న తలపెట్టిన ఒకరోజు జాతీయ సమ్మె జరుగుతుందని వామపక్షాలకు చెందిన కార్మిక సంఘాలు ప్రకటించాయి. కార్మికుల రోజువారీ వేతనాన్ని పెంచటం అంటే ఇప్పుడు అమలు జరుగుతున్న విధానాన్ని యథాతథంగా కొనసాగించటమే అవుతుంది తప్ప, కార్మికులకు అదనంగా ఒరిగేదేమీ లేదని సిఐటియు నేత తపన్ సేన్ స్పష్టం చేశారు. తాము ప్రతిపాదించిన ప్రధాన డిమాండ్లను కేంద్రం ఆమోదించలేదు కనుక సమ్మె జరుగుతుందని ప్రకటించారు. ఇదిలావుంటే బిజెపి, ఆరెస్సెస్ అనుబంధ కార్మిక సంఘాలు మాత్రం సమ్మెలో పాల్గొనటం లేదని ప్రకటించాయి. కేంద్రం తమ డిమాండ్లను ఆమోదించినందున సమ్మె చేయాల్సిన అవసరం లేదని ఆ సంఘాల నేతలు పేర్కొన్నారు.