జాతీయ వార్తలు

తెలంగాణకు ఆశావహ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 30: సి.ఎన్.బి.సి, టి.వి 18 తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన ఈ సంవత్సరం అత్యంత అధిక ఆశావహ రాష్ట్రం అవార్డును రాష్ట్ర పురపాలక, ఐ.టి శాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా అందుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో అరుణ్‌జైట్లీ ఈ అవార్డును రామారావుకు బహూకరించారు. ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్ విభాగంలో తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డును స్వంతం చేసుకున్నది. సిఎన్‌బిసి, టివి 18 జాతీయ స్థాయిలో ప్రభుత్వాలు, పరిశ్రమలు, క్రీడలు, సామాజిక, కళా, వినోద రంగాల్లో అత్యధిక ప్రతిభ చూపించిన వారికి ఈ అవార్డులు అందజేస్తారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వినూత్న, పారదర్శక విధానాలకు గాను అత్యంత ఆశావహ రాష్ట్రం అవార్డుకు ఎంపిక చేశారు.

సి.ఎన్.బి.సి, టి.వి 18 తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన ఈ సంవత్సరం అత్యంత అధిక ఆశావహ రాష్ట్రం అవార్డును కేంద్రమంత్రి అరుణ్ జైట్లీనుంచి స్వీకరిస్తున్న మంత్రి కె.తారకరామారావు