జాతీయ వార్తలు

రెడ్‌క్రాస్ సేవలు నిరుపమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 30: ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవడంలో, సంక్షోభాల నివారణలో రెడ్‌క్రాస్ పాత్ర అమూల్యమైందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, ముఖ్యంగా మానవ తప్పిదాలవల్ల ప్రమాదాలు జరగడం సర్వసాధారణమైన నేటి రోజుల్లో బాధితులను ఆదుకోవడంలో, అలాగే ప్రమాదాల తీవ్రతను తగ్గించడంలో రెడ్‌క్రాస్ పాత్ర మరువలేనిదని మంగళవారం ఇక్కడ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, సెంట్ జాన్ అంబులెన్స్ (ఇండియా) వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ రాష్టప్రతి అన్నారు. బాధితులను ఆదుకోవడం, కాపాడడం, సమాజంలోని అట్టడుగు వర్గాలవారికి ఆరోగ్య సేవలు అందించడం, వివిధ వర్గాల వారిలో ఈ సేవల పట్ల చైతన్యం కల్పించడం లాంటి విషయాల్లో అత్యుత్తమ సేవలందించిన రెడ్‌క్రాస్ సొసైటీ, సెయింట్ జాన్ వలంటీర్లు, సంస్థలకు ఈ సందర్భంగా రాష్టప్రతి అవార్డులను అందజేశారు. భారత్‌లాంటి విశాలమైన దేశంలో విపత్తులు సంభవించిన సమయాల్లోనే కాకుండా మామూలు సమయాల్లో సైతం ప్రభుత్వ పథకాలు లక్షిత వర్గాలకు చేరడానికి ఇలాంటి నిపుణులైన కార్యకర్తలు పెద్దసంఖ్యలో అవసరమని ప్రణబ్ అన్నారు. చిన్న వయసులోనే పాఠశాల స్థాయినుంచే సేవా భావాన్ని పెంపొదింపజేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అభిప్రాయ పడ్డారు. ముఖ్యంగా రెడ్‌క్రాస్ నిర్వహిస్తున్న బ్లడ్‌బ్యాంకులు ఆపన్నులకు సేవలందించడంలో గొప్పపాత్రను పోషిస్తున్నాయన్నారు.

ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, సెంట్ జాన్ అంబులెన్స్ సర్వసభ్య సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అవార్డును అందజేస్తున్న రాష్టప్రతి ప్రణబ్. చిత్రంలో ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా