జాతీయ వార్తలు

ఓబిసి క్రీమిలేయర్ నిర్ధారణకు కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశంలో ఓబిసిల్లో క్రీమిలేయర్‌లను నిర్ధారించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిక మంత్రి తవర్‌చంద్ గెహ్లాట్ బుధవారం వెల్లడించారు. ఈ ప్రక్రియ ఏడాది చివరినాటికి పూర్తవుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ఓబిసిలకు 27శాతం కోటా అమల్లో ఉందని అన్నారు. వార్షిక ఆదాయం ఆరు లక్షలు ఉన్నవారికి కోటా అమలుచేస్తున్నట్టు గెహ్లాట్ చెప్పారు. అంతకంటే ఎక్కువ ఆదాయం వచ్చేవారికి క్రీమిలేయర్‌గా పరిగణిస్తారని మంత్రి పేర్కొన్నారు. వారికి ఎలాంటి రిజర్వేషన్లూ వర్తించవని ఆయన స్పష్టం చేశారు. అయితే క్రీమిలేయర్ అన్నదాన్ని ప్రతిమూడేళ్లకు సమీక్షించేలా నిబంధన ఉందని తెలిపారు. ఓబిసిల్లో క్రీమిలేయర్‌ను నిర్థారించేందుకు 2013లో ఓసారి సమీక్షించినట్టు సామాజిక న్యాయవ్యవహారాల మంత్రి చెప్పారు. రిజర్వేషన్ల పరిమితిని 50 శాతం నుంచి 75 శాతానికి పెంచాలన్న కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి రాందాస్ అథావాలే మంగళవారం చేసిన ప్రకటన నేపథ్యంలో గెహ్లాట్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ శాఖలో ఓబిసిలకు ఉద్దేశించిన ఉద్యోగాలు సరైన అభ్యర్థులు లభించక ఖాళీగానే ఉండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గెహ్లాట్ బుధవారం చేసిన ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓబిసిల సంవత్సర ఆదాయం ఎనిమిది లక్షలకు పెంచాలన్న ప్రతిపాదనపై సామాజిక న్యాయ మంత్రిత్వశాఖ దృష్టి సారించింది. ఆదాయ పరిమితిని పెంచడంద్వారా మరింత ఎక్కువ మందికి ప్రభుత్వ ఉపాధి, విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పించాలని యోచిస్తున్నారు. జాతీయ వెనుకబడిన తరగతులు కమిషన్ ఆదాయ పరిమిత రెట్టింపు అంటే 15 లక్షలకు పెంచాలని ఇటీవల సిఫార్సు చేసింది.
ఈ వర్గాలకు రిజర్వేషన్లు అమలుచేయడం ప్రారంభించి రెండు దశాబ్దాలు కావస్తున్నా నిర్ధేశించిన 27 శాతం కోటా భర్తీనే కాలేదు. 12-15 శాతం కోటానే భర్తీ అవుతోంది. వార్షికాదాయంపై ఉన్న పరిమితుల వల్లే కోటా భర్తీ కావడం లేదని కమిషన్ సభ్యుడు అశోక్ సైనీ వెల్లడించారు.