జాతీయ వార్తలు

పద్ధతి మార్చుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమేథి (యుపి), సెప్టెంబర్ 2: గ్రూ పులు కడుతున్న కార్యకర్తలు తమ పద్ధతి మార్చుకోవాలని, సమష్టిగా పనిచేసినప్పుడే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని కాం గ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తే ప్రత్యర్థి పార్టీలకు ఓటమి తప్పదని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఇక్కడ తెల్లవారుజాము వరకు సుదీర్ఘంగా సాగిన కార్యకర్తల సమావేశంలో పార్టీ సిద్ధాంతాలు, చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. కాంగ్రెస్‌ను విమర్శిస్తున్న పార్టీలపై ఎలా ఎదురుదాడి చేయాలో, ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలో ఆయన కూలంకషంగా ఈ సమావేశంలో వివరించారు. అమేథి లోక్‌సభ నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన ఆయన జిల్లా విజిలెన్స్ కమిటీ సమావేశంలో రాహుల్ మాట్లాడారు. కాగా, తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్‌వాడి కార్యకర్తలు రాహుల్ ప్రయాణించే మార్గంలో బైఠాయించడంతో పోలీసులు వారిని తొలగించారు. లక్నోకు వెళుతున్న సమయంలో అంగన్‌వాడి కార్యకర్తల ఆందోళనను గమనించిన రాహుల్ వాహనం నుంచి వారి సమస్యలు విన్నారు. ఈ నెల 6నుంచి తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ యాత్రలో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. నెల రోజుల పాటు సాగే ఈ యాత్ర ఢిల్లీలో ముగుస్తుంది.