జాతీయ వార్తలు

వృద్ధులకు రక్షణ లేని ఢిల్లీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: వృద్ధులకు సురక్షితం కాని నగరాల్లో దేశ రాజధాని ఢిల్లీ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. వరసగా రెండో సంవత్సరానికి కూడా ఢిల్లీ ఈ ఘనతను నిలబెట్టుకుంది. ఢిల్లీలో ప్రతి లక్ష మంది వృద్ధుల్లో 108.8 మంది నేర బాధితులేనట. అంటే దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే దాదాపు అయిదు రెట్లు వృద్ధులు ఇక్కడ నేరాల బారిన పడే అవకాశముంది. జాతీయ స్థాయిలో ఇలాంటి నేరాల రేటు 20 మాత్రమే. ఇక్కడ వృద్ధులపై జరిగే నేరాల్లో ఎక్కువ భాగం చోరీలేనట. 2015 సంవత్సరానికి గాను నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) ‘్భరత దేశంలో నేరాలు’ పేరిట విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. వృద్ధులపై ఎక్కువ నేరాలు జరిగే రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ ప్రతి లక్ష మందిలో 60.5 మంది నేరాల బారిన పడుతున్నారు.
గత ఏడాది రాష్ట్రంలో ఇలాంటి కేసులు మొత్తం 3456 నమోదయ్యాయి. చత్తీస్‌గఢ్ (53.7), ఆంధ్రప్రదేశ్ (51.6) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.