జాతీయ వార్తలు

రైల్వే టికెట్లకూ ఆధార్ తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: అన్ని విషయాల్లోనూ ఆధార్‌ను తప్పనిసరి చేస్తున్న కేంద్రం ఇక రైల్వే టికెట్లు బుక్ చేసుకోవడానికీ ఆధార్ వివరాలను అందించడాన్ని నిర్బంధం చేయబోతోంది. దీర్ఘకాలంగా ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్న రైల్వే మంత్రిత్వ శాఖ పక్షం రోజుల్లోనే ఖరారు చేసే అవకాశం ఉన్నట్టుగా కథనాలు వెలువడుతున్నాయి. కేవలం రిజర్వ్ టికెట్లకే కాకుండా అన్‌రిజర్వ్డ్ టికెట్లకూ ఆధార్ తప్పనిసరి అని, ఆన్‌లైన్‌లో రిజర్వ్ చేసుకున్నా, కౌంటర్ల వద్ద టికెట్లను పొందినా కూడా ఈ వివరాలను అందించాల్సిందేనన్నది ఈ తాజా ప్రతిపాదనలో కీలకాంశమని చెబుతున్నారు. రైల్వే టికెట్లను దళారులు భారీగా ముందే బుక్ చేసుకోవడం.. అనంతరం వాటిని బ్లాక్‌లో అమ్మడంవల్ల తలెత్తుతున్న సమస్యలకు విరుగుడుగా ఆధార్ వివరాలు అందించడాన్ని నిర్భంధం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. సీనియర్ సిటిజన్లు, స్వాతంత్య్ర సమరయోధులు, దివ్యాంగులు, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు నేరుగానే దీనివల్ల లబ్ధి చేకూరుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.