జాతీయ వార్తలు

కాశ్మీరీల త్యాగానికి బక్రీద్ అంకితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, సెప్టెంబర్ 13: కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ తన దుందుడుకు ధోరణిని విడనాడటం లేదు. ముస్లింల పర్వదినం ఈద్ ఉల్ ఆఝా (బక్రీద్)ను ‘కాశ్మీరీల అసమాన త్యాగాలకు’ అంకితం ఇస్తున్నామని పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మంగళవారం ప్రకటించారు. ‘కాశ్మీర్ ప్రజల సమస్య పరిష్కారం అయ్యేంతవరకు మేం ఇలాగే వారికి మద్దతునిస్తాం. కాశ్మీర్ ప్రజలు భారత్ నుంచి స్వాతంత్య్రం సాధించేందుకు తమ మూడో తరాన్ని కూడా త్యాగం చేశారు. భారత్ చేస్తున్న అత్యాచారాలను ఎదుర్కొంటూ, స్వయం నిర్ణయాధికారంకోసం పోరాటం చేస్తున్నారు. కాశ్మీరీ సోదరులు, సోదరీమణులు ఉగ్రవాదానికి బలవుతున్నారు. ఈ పరిస్థితిలో మనం కాశ్మీర్ ప్రజలకు అండగా నిలవాలి. వాళ్ల త్యాగాలకు త్వరలోనే ఫలితం వస్తుంది. త్వరలోనే స్వేచ్ఛా కాశ్మీర్‌లో వాళ్లు పండుగ చేసుకోబోతున్నారు’ అని నవాజ్ షరీఫ్ అన్నారు. గడాఫీ స్టేడియంలో జమాత్ ఉద్ దవా చీఫ్, మోస్ట్ వాంటెడ్ హఫీజ్ సరుూద్ ప్రార్థనలు చేశాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ భారత సైన్యాలకు వ్యతిరేకంగా కాశ్మీరీలు విజయం సాధించారన్నారు. ఈ సమయంలో భారత్ నుంచి స్వాతంత్య్రం పొందటానికి నవాజ్ షరీఫ్ పూర్తి సహకారాన్ని అందించాల్సి ఉందని డిమాండ్ చేశారు.
కాశ్మీర్ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి భారత్‌ను ఏకాకిని చేయటం లక్ష్యంగా పాకిస్తాన్‌కు చెందిన 22మంది పార్లమెంటేరియన్లు, ప్రత్యేక దూతలు ఇప్పటికే వివిధ దేశాల రాజధానులకు బయలుదేరారు. భారత సైన్యం కాశ్మీరీలపై దురాగతాలకు పాల్పడుతోందని వారు ప్రచారం చేయనున్నారు. తాజాగా షరీఫ్ వ్యాఖ్యలతో ఇప్పటికే అనిశ్చితితో ఉన్న కాశ్మీర్ విషయం భారత్, పాక్‌ల మధ్య మరింతగా ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించినట్లయింది.