జాతీయ వార్తలు

ఆ ప్రొఫెసర్లను వెనక్కి పంపించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ప్రజాప్రతినిధుల వద్ద పీఎ, పీఎస్‌లుగా పనిచేస్తున్న ప్రొఫెసర్లను తిరిగి బోధన వృత్తికి పంపించామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. గురువారం న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ నాగప్పన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రజాప్రతినిధుల దగ్గర పని చేస్తున్న యూనివర్సిటి ప్రొఫెసర్ల విషయం ఏంచేశారని ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాదిని జస్టిస్ దీపక్ మిశ్రా ప్రశ్నించారు. దానికి ప్రభుత్వ న్యాయవాది సమాధానమిస్తూ విశ్యవిద్యాలయాల నుండి ముగ్గురు పని చేస్తుంటే అందులో ఇద్దరు ప్రొఫెసర్లు ఉండగా, వారిని తిరిగి తమ స్థానాల్లోకి పంపిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వెల్లడించారు. మిగిలిన ఒకరు బోధనేతర సిబ్బంది అని పేర్కొన్నారు. అనంతరం ధర్మాసనం కేసు విచారణను 5వ తేదీకి వాయిదా వేసింది.