జాతీయ వార్తలు

బలూచిస్తాన్‌కు మద్దతు ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: పాకిస్తాన్.. బలూచిస్తాన్‌లో అణచివేతకు, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినంత కాలం తాను ఆ అంశాన్ని లేవనెత్తుతూనే ఉంటానని భారత్ గురువారం స్పష్టం చేసింది.
‘బలూచిస్తాన్ అణచివేతకు, మా నవ హక్కుల ఉల్లంఘనకు గురయినంత కాలం భారత్ ఈ అంశాన్ని లేవనెత్తుతుంది’ అని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ అన్నారు. భారత్ మొదటిసారిగా ఐక్యరాజ్య సమితి (ఐరాస) ముందు బుధవారం బలూచిస్తాన్ అంశాన్ని లేవనెత్తిన విషయం తెలిసిందే. పాకిస్తాన్.. బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె)లో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని భారత్ ఐరాస మానవ హక్కుల సమితి 33వ సెషన్‌లో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. కాశ్మీర్‌లో అల్లర్లకు పాకిస్తాన్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదమే ప్రధాన కారణమని పేర్కొంది. భారత్‌లో అంతర్భాగమైన కాశ్మీర్‌ను ఆక్రమించుకోవాలని కోరుకుంటున్న పాకిస్తాన్.. అందుకోసం తన గడ్డమీద ఉగ్రవాదాన్ని పెంచి పోషించి కాశ్మీర్‌పైకి ఉసికొల్పుతోందని ఐరాసలో పర్మనెంట్ రిప్రజెంటేటివ్, భారత రాయబారి అజిత్ కుమార్ విమర్శించారు. ఐరాస మానవ హక్కుల సమితి సెషన్‌లో పాకిస్తాన్ చేసిన ఒక ప్రకటనకు సమాధానమిచ్చే హక్కును వినియోగించుకున్న అజిత్ కుమార్ ఆ దేశంపై ఎదురుదాడికి దిగారు. పాకిస్తాన్ తాను ఆక్రమించిన కాశ్మీర్‌తో పాటు బలూచిస్తాన్‌లోని తన స్వంత పౌరులపైన ఒక క్రమపద్ధతిలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆయ న ధ్వజమెత్తారు.
భారత్ శాంతియుత సహజీవనాన్ని పాటిస్తున్న బహుళ సంస్కృతులున్న ప్రజాస్వామిక దేశమని ఆయన పేర్కొన్నారు. ఇందుకు విరుద్ధంగా.. నియంతృత్వ లక్షణాలు గల, ప్రజాస్వామిక నియమాలు లేని పాకిస్తాన్ బలూచిస్తాన్ సహా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని అజిత్ కుమార్ పేర్కొన్నారు.

శాంతించని కాశ్మీరం
భారీగా బలగాల మోహరింపు
స్తంభించిన జనజీవనం
శ్రీనగర్, సెప్టెంబర్ 15: వరుసగా 69వ రోజైన గురువారం కూడా కాశ్మీర్‌లో తీవ్రస్థాయిలో అల్లర్లు చోటుచేసుకోవడం జనజీవనం స్తంభించిం ది. శ్రీనగర్‌తో పాటు అనేక ప్రాం తాల్లో చెలరేగిన అల్లర్లను అదుపు చేయడానికి గురువారం నా డు భారీఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. కాశ్మీర్ లోయ ప్రాంతం లో కూడా అనేకచోట్ల జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వేర్పా టువాదులు నిరంతరంగా బంద్, నిరసన కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. పరిస్థితి అదుపు తప్పకూడదన్న ఉద్దేశంతో అనేకమంది వేర్పాటువాద నే తలను శ్రీనగర్‌లో గృహనిర్బంధం చేశారు. హిజ్బుల్ ముజాహిదీన్ క మాండర్ బుర్హాన్ వనీ పోలీసు కాల్పుల్లో జూలై 9న మరణించినప్ప టి నుంచీ అడ్డూ అదుపు లేకుండా కాశ్మీర్‌లో అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘటనల్లో మొత్తం 86మంది మరణించారు. దాదాపు 12వేలమంది తీవ్రంగా గాయపడ్డారు.