జాతీయ వార్తలు

చికిత్సకు లొంగని చికున్ వైరస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది చికున్ గున్యా కారణంగా చనిపోయిన వారు, ఆ వ్యా ధితో బాధపడుతున్న వారి సంఖ్య వి పరీతంగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఆ వ్యాధికి కారణమైన వైరస్ ప్రవర్తన మారడమేనని వైద్య నిపుణులు భావిస్తున్నారు. అయితే వైరస్ తీరుపై పరిశోధనల్లో మాత్రమే ఈ విషయం నిర్ధారణ అవుతుందని వారంటున్నారు. చికున్ గున్యా, డెం గ్యూ వ్యాధులు రెండూ కూడా ఒకే దోమ(ఏడ్స్) ద్వారా సంక్రమిస్తూ ఉ న్నప్పటికీ డెంగ్యూ వ్యాధి నాలుగు రకాల వైరస్‌ల ద్వారా సోకుతుండగా, చికున్ గున్యా మాత్రం ఒకే రకమైన వైరస్ ద్వారా సోకుతోందని జాతీయ స్థాయి దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల నియంత్రణ కార్యక్రమం (ఎన్‌విబిడిసిపి) డైరెక్టర్ ఎసి ధరీవాల్ చెప్పారు. అంతేకాదు ఉత్తరాది ప్రజ ల్లో ఈ వైరస్ నిరోధక శక్తి తక్కువగా ఉండడం కారణంగానే వారు ఎక్కువమంది ఈ వ్యాధి బారిన పడుతున్నారని కూడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల వారితో పోలిస్తే ఉత్తరాది వారికి ఈ చికున్ గున్యా వైరస్ సోకే ప్రమాదం తక్కువ అని ఎస్‌డిఎంసి ఆరోగ్య అధికారి పికె హజారికా చెప్పారు. అయి తే శాస్తజ్ఞ్రులు నిరూపించే దాకా ఈ వైరస్ ప్రవర్తన మారుతోందనే అం చనా కేవలం ఊహాజనితమైనదేనని ఆయన అభిప్రాయ పడ్డారు.
అయితే చికున్ గున్యా రోగులకు తమ ఆస్పత్రిలో జరిపిన రక్త పరీక్షల్లో ఈ వైరస్ ప్రవర్తనలో తేడా ఉన్నట్లు గుర్తించినట్లు నగరంలోని సర్‌గంగారామ్ ఆస్పత్రి సీనియర్ డాక్టర్ ఒకరు చెప్పారు. ఇంతకు ముందు రోగులపై ఐజిఎం సెరాలజీ పరీక్ష నిర్వహించే వాళ్లమని, అయితే వైరస్ ప్రవర్తనలో తేడా ఉన్నట్లు గుర్తించిన తర్వాత ఈ వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్న రోగుల్లో వైరస్‌ను గుర్తించడం కోసం ఈ నెల 1వ తేదీనుంచి పరమాణు పరీక్ష (ఆర్‌టి-పిసిఆర్) నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. సెప్టెంబర్ 1నుంచి 13వ తేదీ మధ్య ఈ వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్న 565 మంది రోజుల బ్లడ్ శాంపిల్స్‌ను పరీక్షించగా, వారిలో 319 మందిలో ఈ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఆయన చెప్పారు. అంటే ఐజిఎం ద్వారా నెగెటివ్‌గా తేలిన ఒక పరీక్ష ఆర్‌టి-పిసిఆర్ ద్వారా పాజిటివ్‌గా వస్తోందని ఆ డాక్టర్ చెప్పారు. కర్నాటక, తమిళనాడులాంటి దక్షిణాది రాష్ట్రాల్లో చికున్ గున్యా లాంటి ఇన్‌ఫెక్షన్ జ్వరాలు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడి వారు ఈ వ్యాధులకు ఎక్కువగా తట్టుకోగలుగుతున్నారని బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్ చెప్పడం గమనార్హం.

ప్రాణాంతకం కాదు..

ఢిల్లీ ఆరోగ్య
మంత్రి వాదన

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: చికున్ గున్యా కారణంగా ఎవరూ చనిపోరని గతంలో చెప్పిన ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ మరోసారి తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన డెంగ్యూ లాగా చికున్ గన్యా కారణంగా ఎవరూ చనిపోరని అంటూ, ఇది తన మాట కాదని, గూగుల్ కూడా చెప్పిందని అన్నారు. అయితే నగరంలో ఈ వ్యాధి కారణంగా చనిపోయే వారి సంఖ్య పెరగడానికి కారణాలేమిటో చెప్పడానికి తాను నిపుణుడిని కాదని కూడా ఆయన అన్నారు. ‘దీనిపై ఒక చర్చ మొదలైంది. వాళ్లు ఎందుకు చనిపోతున్నారో డాక్టర్లు, శాస్తజ్ఞ్రులు మాత్రమే చెప్పగల సమర్థులు’ అని జైన్ చెప్పారు. దేశంలో చికున్ గున్యా కారణంగా ఒక్కరు కూడా చనిపోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా కూడా తనతో అన్నారని ఆయన అన్నారు. చికున్ గున్యా ప్రాణాంతక వ్యాధి కాదని, చాలా అరుదుగా ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల్లో మాత్రమే అది సంక్లిష్టంగా మారుతుందని డాక్టర్లు కూడా చెబుతున్నారని ఆయన అన్నారు. మీడియా ఒకవైపు కథనాన్ని మాత్రమే చూపిస్తోందని ఆయన విమర్శిస్తూ, అన్ని ఆస్పత్రుల్లో డాక్టర్లు, ఇతర సిబ్బంది చాలా శ్రమిస్తున్నారన్నారు. ‘్ఢల్లీలోని 12 ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంచి సదుపాయాలున్నాయి. 2 వేల పడకలు ఖాళీగా ఉన్నాయి. ఎవరికీ ట్రీట్‌మెంట్ నిరాకరించడం లేదు. ప్రతి రోగికి చికిత్స చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం’ అని జైన్ స్పష్టం చేశారు.