జాతీయ వార్తలు

టాంజానియాలో ఎంహెచ్370 శకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలాలంపూర్, సెప్టెంబర్ 15: రెండేళ్ల క్రితం అదృశ్యమైన మలేసియా విమానం ఎంహెచ్ 370 శకలం టాంజానియాలో లభించినట్లు మలేసియా ప్రభుత్వం ప్రకటించింది. టాజానియా సముద్ర తీరంలోని పెంబా ద్వీపంలో విమాన శకలం లభించిందని, ఇది రెండేళ్లుగా మిస్టరీగా మారిన ఎంహెచ్370 విమానానిదేనని ఆస్ట్రేలియా నిపుణులు తేల్చి చెప్పారు. ‘‘టాంజానియాలో దొరికిన ఈ శకలం ఎంహెచ్370గా పిలిచే 9ఎం-ఎంఆర్‌ఓ విమానానిదేనని నిపుణులు నిర్ధారించారు’’ అని మలేసియా పౌర విమానయాన శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. విమాన ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని అనే్వషించేందుకు ఈ శకలాన్ని సాంకేతికంగా, లోతుగా పరీక్షిస్తున్నామని తెలిపింది.