జాతీయ వార్తలు

ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నారు. ఈనెల 26న నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు ప్రకటించిన ఈసీ, అభ్యర్థుల నామినేషన్లకు చివరి తేది అక్టోబర్ 3గా పేర్కొంది. అలాగే నామినేషన్ల పరిశీలన ప్రక్రియ అక్టోబర్ 4న పూర్తి చేయనుంది. అదేవిధంగా అక్టోబర్ 17న పోలింగ్ నిర్వహించి సాయంత్రం 5 గంటలలోపు ఫలితాలు ప్రకటించనున్నారు. అక్టోబర్ 20నాటికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు ఎన్నికల సంఘం పేర్కొంది. దీంతోపాటుగా ఇటీవల గవర్నర్‌గా నియమితులైన నజ్మా హెప్తుల్లా మధ్యప్రదేశ్‌నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికీ ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
తుమ్మల స్థానంలో ఫరీదుద్దీన్
ఎమ్మెల్సీగా కేబినెట్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు మండలి స్థానానికి రాజీనామా చేశారు. ఈ ఖాళీని భర్తీ చేసేందుకే ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతోంది. తుమ్మల స్థానంలో మాజీ మంత్రి ఫరీదుద్దీన్ అభ్యర్థిత్వాన్ని సిఎం కెసిఆర్ ముందుగానే ప్రకటించారు. ఈ ఎన్నిక నామ మాత్రమే. శాసన సభలో తెరాసకు సంపూర్ణ మెజారిటీ ఉండడంతో ఏకగ్రీవంగానే ఫరీదుద్దీన్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది.