జాతీయ వార్తలు

లోపం ఎక్కడుంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: యూరి సెక్టార్‌లో 20మంది వీరజవాన్లను బలి తీసుకున్న ఉగ్రవాద ఘటన అసలు ఎలా సంభవించింది. భారత, పాక్ సరిహద్దులో అత్యంత వ్యూహాత్మకమైన సైనిక స్థావరంగా చెప్పుకునే యూరిలో సైనికులు విశ్రాంతి తీసుకునే శిబిరాల దాకా ఉగ్రవాదులు ఎలా చొచ్చుకురాగలిగారన్న దానిపై సైనిక ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. సెక్యూరిటీ లోపాలు ఎక్కడ జరిగాయన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఉగ్రవాదులు చొరబడటానికి రెండు అవకాశాలపై అధికారులు దృష్టి సారించారు. మొదటిది యూరి సెక్టార్ భారత్-పాక్ వాస్తవాధీన రేఖకు కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడి నుంచే ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడ్డారన్నది ఖాయంగా కనిపిస్తోంది. రెండోది ఆర్మీ బేస్ ప్రాంగణంలో నిఘా వైఫల్యం. సైనిక శిబిరానికి ఉన్న ఫెన్సింగ్‌ను తెంచేసుకుని ఉగ్రవాదులు లోపలికి చొచ్చుకొచ్చారు. ఈ రెండింటి దగ్గర నిఘా వైఫల్యం వల్లనే ఉగ్రవాదులు అతిపెద్ద దాడిని చేయగలిగారు. ఆర్మీ క్యాంప్‌కు సంబంధించిన పూర్తి లేఅవుట్ ఉగ్రవాదుల దగ్గర ఉందనేది స్పష్టమయింది. అందువల్లనే వాళ్లు సులభంగా ఫెన్సింగ్‌ను ఛేదించుకుని లోపలికి రాగలిగారు. ఇప్పుడు దీని వెనుక ప్రధాన సూత్రధారి ఎవరన్నది కనిపెట్టేందుకు సైన్యం లోతుగా దర్యాప్తు చేస్తోంది.

యూరిలో దాడికి పాల్పడి భారత సైన్యం చేతిలో హతమైన ఉగ్రవాదుల వద్ద లభించిన ఆయుధాలు
సైనిక శిబిరం ముందు విధి నిర్వహణలో ఉన్న సెంట్రీ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా లేడు. ఈ విషయం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో జరిగిన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో కూడా ప్రస్తావనకు వచ్చింది.
పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలోకి జైష్ ఎ మహమ్మద్ ఫిదారుూలు చొరబడిన ఘటన తరువాత, తిరిగి యూరి స్థావరంలోకి చొరబడటం తీవ్రంగా పరిగణించాల్సిన నిఘా లోపమని ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న అందరూ ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు.

ఈ దాడి వెనుక జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని నిఘా వర్గాలు ధ్రువీకరణకు వచ్చాయి. జైష్ ప్రతినిధి ఒకరు కాశ్మీర్‌లో స్థానిక జర్నలిస్టు ఒకరికి ఫోన్ చేసి యూరి దాడికి తామే బాధ్యులమని చెప్పటం గమనార్హం.
పఠాన్‌కోట్‌పై దాడి చేసింది కూడా జైష్ ఉగ్రవాదులే అయినప్పటికీ, తామే చేశామని మాత్రం చెప్పుకోలేదు.
ఉగ్రవాదులు సాధారణంగా అనుసరించే పద్ధతులనే యూరి దాడిలోనూ అనుసరించారు. దాడికి ముందురోజు రాత్రి పాకిస్తాన్ నుంచి చొరబడటం.. నేరుగా దాడి చేయాల్సిన ప్రాంతానికి వెళ్లటం, ఆపరేషన్ పూర్తి చేయటం వంటివి జైష్ ఉగ్రవాదులు చేసేపని. యూరి దాడిలోనూ ఉగ్రవాదులు కొద్ది గంటల ముందే శనివారం రాత్రి యూరి సెక్టార్‌కు చాలా దగ్గరలో ఉన్న వాస్తవాధీన రేఖ దాటి చొరబడ్డారు.
దాడికి ముందే రెక్కీ జరిగింది. ఉగ్రవాదులకు సైనిక శిబిరానికి సంబంధించిన లేఅవుట్ గురించి పూర్తిగా తెలుసు. ఎక్కడెక్కడ ఫెన్సింగ్ బలహీనంగా ఉందో కూడా వారికి తెలిసి ఉండవచ్చు. దాని ప్రకారమే బలహీనంగా ఉన్నచోట ఫెన్సింగ్‌ను తేలిగ్గా తెంచేసుకుని ఉగ్రవాదులు చొరబడ్డారు.