జాతీయ వార్తలు

టూరిజంలో మంచి అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో దేశంలోనే కీలకపాత్ర పోషిస్తోందని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. బుధవారం నాడు ఢిల్లీ పర్యాటనలో టూరిజం ఇనె్వస్టర్స్ సమ్మిట్-2016లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏపీ పర్యాటకపరంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సదుపాయాలను ఏర్పాటు చేసిందని వివరించారు. పొడవైన సముద్ర తీరం కోస్తా తీరం, నదులు, సరస్సులు, జలాశయాలు, జలపాతాలు ఇలా ఎన్నో సహజ అందాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 39 నగరాలు, పట్టాణాలు బీచ్‌లకు పెట్టింది పేరని ఆయన తెలిపారు. రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్ సరపరా, 46 వేల కిలోమీటర్ల రోడ్లు, 4300 కిమీ జాతీయ రహాదారులు, 7040 కి.మీ రైలు మార్గం ఉన్నాయని వెల్లడించారు. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాలు తిరుపతి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, విజయవాడ కనకదుర్గ, ద్వారక తిరుమల, అన్నవరం, సింహాచలం మొదలైన దేవాలయాలు ఏపీలో ఉన్నాయని చెప్పారు. అలాగే బుద్ధిజానికి అమరావతి, నాగార్జున కొండలు, పేరొందాయన తెలిపారు. అమరావతిలో పర్యాటక యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తామన్నారు.