జాతీయ వార్తలు

కోటిన్నర టర్నోవర్ పరిశ్రమలను రాష్ట్రాల పరిధిలో ఉంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: సంవత్సరానికి కోటిన్నర రూపాయల టర్నోవర్ కలిగిన పరిశ్రమలు, సంస్థలన్నింటినీ రాష్ట్రాల పరిధిలోనే ఉంచాలని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)పై శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రస్తుతం కొన్ని వస్తువులు, సేవలపై రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న పన్నులను కూడా రాష్ట్రాల పరిధిలోనే ఉండాలని కోరినట్లు ఈటల చెప్పారు. అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రాలు కూడా ఆర్థిక పరిపుష్ఠితో ఉండలని, దేశంలోని ప్రజలందరికీ మేలు చేసేలా కేంద్రం నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. రాష్ట్రాల్లో కొన్ని వస్తువుల ఉత్పత్తిపై పలు సంస్థలకు రాయితీలు ఇస్తున్నామని, జిఎస్‌టి అమలు తర్వాత ఈ రాయితీల భారాన్ని ఎవరు భరించాలన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని ఈటల పేర్కొన్నారు.