జాతీయ వార్తలు

పాక్ కళాకారులు ఉగ్రవాదులు కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: ఉగ్రవాదాన్ని, కళలను ఒకే గాటన కట్టరాదని, పాకిస్తాన్ నుంచి వచ్చిన కళాకారులను ఉగ్రవాదుల మాదిరిగా పరిగణించరాదని బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ అన్నాడు. ఉరీ దాడి ఘటన నేపథ్యంలో దేశీయ చిత్ర పరిశ్రమ నుంచి పాక్ నటీనటులను నిషేధించాలని భారత చలనచిత్ర నిర్మాతల సంఘం గురువారం తీర్మానించడంతో సల్మాన్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. నియంత్రణ రేఖ వెంబడి గురువారం తెల్లవారు జామున మెరుపు దాడులు నిర్వహించి ఏడు ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్లు భారత సైనిక దళం ప్రకటించిన వెంటనే చలనచిత్ర నిర్మాతల సంఘం ఈ తీర్మానం చేసింది. అయితే పాక్ నుంచి వచ్చిన కళాకారులు కేవలం కళాకారులు మాత్రమేనని, ఉగ్రవాదులు కారని, ఉగ్రవాదానికి, కళలకు సంబంధం లేదని సల్మాన్ పేర్కొన్నాడు. పాక్ నటీనటులు సరైన వీసాలతోనే భారత్‌కు వచ్చారని, వారికి ప్రభుత్వ వర్క్ పర్మిట్లను కూడా ఇచ్చిందని అతను ఈ సందర్భంగా గుర్తు చేశాడు.