జాతీయ వార్తలు

ఆ సంస్కృతి మాది కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: భారత్ ఏ దేశంపైనా దాడి చేయలేదని, ఎవరి భూభాగాన్ని ఆక్రమించుకోవాలన్న కాంక్ష భారత్‌కు లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం స్పష్టం చేశారు. కేవలం దేశం కోసమే కాకుండా ఇతరుల కోసం భారతీయులు ఎనలేని త్యాగాలు చేశారని ఆయన కొనియాడారు. అంతర్జాతీయ వేదికల్లో పాకిస్తాన్ తరచుగా కాశ్మీరు అంశాన్ని ప్రస్తావిస్తూ మొసలి కన్నీరు కారుస్తున్న నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘్భరత్ ఎవరిపైనా దాడి చేయలేదు. ఎవరి భూభాగాన్ని ఆక్రమించుకోవాలన్న కాంక్ష భారత్‌కు లేదు. రెండు ప్రపంచ యుద్ధాలతో భారత్‌కు ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినప్పటికీ 1.5 లక్షల మంది భారత సైనికులు ప్రాణ త్యాగాలు చేశారు’ అని ఆదివారం ఇక్కడ ప్రవాస భారతీయ కేంద్ర ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికల్లో పాకిస్తాన్ తరచుగా కాశ్మీరు అంశాన్ని ప్రస్తావిస్తూ మొసలి కన్నీరు కారుస్తుండటంతో పాటు నియంత్రణ రేఖ వెంబడి పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద స్థావరాలపై భారత జవాన్లు ఇటీవల మెరుపు దాడులు జరిపిన నేపథ్యంలో ప్రధాని ఈ ప్రకటన చేశారు. దేశం కోసమే కాకుండా ఇతరుల శ్రేయస్సు కోసం భారత సైనికులు ఎనలేని త్యాగాలు చేస్తున్నారని, అయితే ఈ త్యాగాల ప్రాముఖ్యతను ప్రపంచం గుర్తించడం లేదని ఆయన ధ్వజమెత్తారు. విదేశాలకు వెళ్లినప్పుడల్లా తాను అక్కడ భారత సైనికుల స్మారక స్థూపాలను సందర్శించి నివాళులర్పిస్తున్నట్లు మోదీ తెలిపారు. విదేశాల్లో రాజకీయాలు చేయాలు చేయాలనిగానీ లేక అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవాలని గానీ భారతీయులు ఆశించడం లేదని, ఆయా దేశాల్లోని ఇతర జాతీయులతో భారతీయులు మమేకమై జీవిస్తున్నారని, సామాజిక శ్రేయస్సే ధ్యేయంగా వారు ముందుకు సాగుతున్నారని ప్రధాని శ్లాఘించారు. ‘విదేశాల్లో జీవిస్తున్న భారతీయులు నీరు లాంటి వారు. అవసరాలకు అనుగుణంగా తమను తాము మలచుకుని అక్కడి స్థానికులతో మమేకమై ముందుకు సాగుతున్నారు. విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయుల సంఖ్య ఎంతన్నది ముఖ్యం కాదు. వారి బలమెంతన్నదే ముఖ్యం. చాలా దేశాల్లో ప్రవాస భారతీయులు అక్కడి భారత దౌత్య సిబ్బంది కంటే ఎంతో ఎంతో శక్తిమంతులు. భారత్ గురించి తెలియని వారిలో భయాన్ని తొలగించేందుకు ఇది దోహదపడుతుంది’ అని మోదీ పేర్కొన్నారు.

చిత్రం... ప్రవాస భారతీయ కేంద్ర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతిభావంతులకు పతకాలు
అందిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ తదితరులు